ETV Bharat / sports

పెళ్లికి సిద్ధమైన టీమ్ఇండియా పేసర్​ బుమ్రా! - ఇండియా vs ఇంగ్లాండ్​ 4వ టెస్టు

ఇంగ్లాండ్​తో జరగనున్న ఆఖరి టెస్టు నుంచి అనూహ్యంగా తప్పుకున్న టీమ్​ఇండియా పేసర్ జస్​ప్రీత్​​ బుమ్రా త్వరలోనే పెళ్లిపీటలెక్కనున్నాడని సమాచారం. పెళ్లి కోసమే బుమ్రా సెలవులు తీసుకున్నట్లు బీసీసీఐ వర్గాలు తెలిపాయి.

India vs England: Bumrah has taken leave to prepare for marriage
పెళ్లికి సిద్ధమైన టీమ్ఇండియా పేసర్​ బుమ్రా!
author img

By

Published : Mar 2, 2021, 9:57 PM IST

మార్చి 4 నుంచి ఇంగ్లాండ్​తో జరగనున్న నిర్ణయాత్మక టెస్టు తుదిజట్టు నుంచి తప్పుకున్నాడు టీమ్ఇండియా పేసర్​ జస్​ప్రీత్​ బుమ్రా. వ్యక్తిగత కారణాలతో తనను జట్టు ఎంపికలో పరిగణించవద్దని భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ)ని కోరాడు. అయితే ఈ నేపథ్యంలో బుమ్రా పెళ్లికి సిద్ధమయ్యాడనే వార్తలు వినిపిస్తున్నాయి. వివాహం కోసం కొన్ని రోజుల పాటు సెలవు కోరినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని బీసీసీఐ వర్గాలు ధ్రువీకరించాయి.

"తాను పెళ్లి చేసుకోబోతున్నట్లు బీసీసీఐకి బుమ్రా సమాచారమిచ్చాడు. దీంతో వివాహానికి ముందు కొన్ని రోజులు సెలవు తీసుకున్నాడు." అని బీసీసీఐ వర్గాలు తెలిపాయి.

ప్రస్తుతం ఇంగ్లాండ్​తో జరుగుతున్న టెస్టు సిరీస్​లో రెండు మ్యాచ్​లు ఆడిన బుమ్రా.. 4 వికెట్లను పడగొట్టాడు. చెన్నై వేదికగా జరిగిన రెండో టెస్టులో విశ్రాంతి తీసుకున్నాడు. అయితే మూడో టెస్టులో స్పిన్నర్లదే పైచేయి కావడం వల్ల బుమ్రాకు బౌలింగ్​ వేసే అవకాశం రాలేదు. ఇంగ్లాండ్​తో ఆడబోయే టీ20 సిరీస్​లోనూ బుమ్రాకు విశ్రాంతినిచ్చింది బీసీసీఐ.

ఇదీ చూడండి: ఇంగ్లాండ్​తో చివరి టెస్టుకు బుమ్రా దూరం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.