ఇంగ్లాండ్‌తో జరుగుతోన్న తొలి టీ20లో టీమ్ఇండియా ఆరంభం నుంచి తడబడుతూ ఆడింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కోహ్లీసేన.. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 125 పరుగులు నమోదు చేసింది. శ్రేయస్ అయ్యర్(67) అర్థశతకంతో ఆకట్టుకున్నాడు.
ఇంగ్లీష్ బౌలర్ల ధాటికి ఆరంభంలోనే ఓపెనర్ కేఎల్ రాహుల్(1), కెప్టెన్ విరాట్ కోహ్లీ(0) వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆ వెంటనే శిఖర్ ధావన్(4) వెనుదిరగ్గా.. పంత్‌తో కలిసి శ్రేయస్ అయ్యర్ భాగస్వామ్యం నిలదొక్కుకుంటున్న సమయంలో పంత్(21) ఔటయ్యాడు. హార్దిక్ పాండ్యాతో కలిసి శ్రేయస్ అయ్యర్ మంచి పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఆ తర్వాత వచ్చిన బ్యాట్స్‌మెన్ వెంటనే వెనుదిరిగారు. మరోవైపు ఇంగ్లాండ్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్ 3 వికెట్లు పడగొట్టగా.. బెన్ స్టోక్స్, మార్క్ వుడ్, ఆదిల్ రషీద్, క్రిస్ జోర్డాన్ తలో వికెట్ సాధించారు.
నల్ల బ్యాండ్లతో సంఘీభావం..
టీమ్ఇండియాతో జరుగుతోన్న తొలి టీ20లో ఇంగ్లాండ్ ఆటగాళ్లు చేతికి నల్ల బ్యాండ్ ధరించి ఫీల్డింగ్‌కు వచ్చారు. మార్చి 8న ఇంగ్లాండ్ సీనియర్ క్రికెటర్, బౌలర్ జోయ్ బెంజిమెన్ గుండెపోటుతో మరణించిన కారణంగా.. అతనికి సంఘీభావంగా ఆ బ్యాండ్ ధరించినట్లు ఈసీబీ ప్రకటించింది.