చెన్నై టెస్టు తొలి ఇన్నింగ్స్లో భారత్ 337 పరుగులకు ఆలౌటైంది. 257/6తో నాలుగో రోజు ఆట కొనసాగించిన టీమ్ఇండియా మరో 21.5 ఓవర్లు మాత్రమే ఆడింది. మొదటి సెషన్లో కాసేపు ప్రతిఘటించిన అశ్విన్, వాషింగ్టన్ జోడీ జట్టును 300 పరుగుల మార్క్ దాటించారు. 80 పరుగుల విలువైన భాగస్వామ్యం నమోదు చేసిన ఈ జోడీని స్పిన్నర్ లీచ్ విడగొట్టాడు.
ఓ వైపు వాషింగ్టన్ సుందర్ అర్ధ సెంచరీతో జట్టును ఆదుకొనే ప్రయత్నం చేశాడు. 85 పరుగులతో అజేయంగా నిలిచాడు. మరో ఎండ్లో అతనికి సహకారం అందించేవారు కరువయ్యారు. ఇంగ్లాండ్ జట్టుకు 241 పరుగుల భారీ ఆధిక్యం లభించింది.
ఇదీ చదవండి: 'షాట్ల ఎంపికలో పంత్ తెలివిగా ఉండాలి'