ఇంగ్లాండ్‌తో జరుగుతోన్న మూడో (పింక్-బాల్) టెస్టులో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఇరు జట్లు పలు మార్పులతో బరిలోకి దిగుతున్నాయి. టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ రేసులో నిలవాలంటే.. టీమ్ఇండియా ఈ మ్యాచ్ తప్పక గెలవాలి.
ఈ సిరీస్‌లో భాగంగా ఆడిన రెండు టెస్టుల్లో చెరో మ్యాచ్ గెలిచిన ఇరుజట్లు సిరీస్‌ను సమం చేశాయి. ఈ మ్యాచ్‌లో గెలిచి 2-0 ఆధిక్యంలోకి వెళ్లాలని ఇరుటీమ్లు ప్రణాళికలు రచిస్తున్నాయి. టీమ్ఇండియా పేసర్ ఇషాంత్ శర్మకు ఇది వందో టెస్టు కావడం విశేషం.
జట్లు:
టీమ్ఇండియా: రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్, ఛెతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ (కెప్టెన్), అజింక్య రహానె, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, ఇషాంత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా.
ఇంగ్లాండ్: డొమినిక్ సిబ్లీ, జాక్ క్రాలే, జానీ బెయిర్‌స్టో, జో రూట్ (కెప్టెన్), బెన్ స్టోక్స్, ఓల్లీ పోప్, బెన్ ఫోక్స్ (వికెట్ కీపర్), జోఫ్రా ఆర్చర్, జాక్ లీచ్, స్టువర్ట్ బ్రాడ్, జేమ్స్ అండర్సన్.
ఆటగాళ్లతో రాష్ట్రపతి, షా..
మ్యాచ్ ప్రారంభానికి ముందు టీమ్ఇండియా, ఇంగ్లాండ్ ఆటగాళ్లను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, హోంమంత్రి అమిత్‌షా కలిశారు. ఇరుజట్లు కెప్టెన్లు కోహ్లీ, రూట్.. తమ ఆటగాళ్లను వారికి పరిచయం చేశారు. 100వ టెస్టు ఆడుతోన్న పేసర్ ఇషాంత్ శర్మ.. రాష్ట్రపతి చేతులమీదుగా జ్ఞాపికను అందుకున్నాడు.
ఇదీ చూడండి: భారత్-ఇంగ్లాండ్ టెస్టు: భారత ఆటగాళ్లను ఊరిస్తున్న రికార్డులు