ఇంగ్లాండ్‌తో రెండో టెస్టుకు యువ ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ పూర్తిగా సిద్ధంగా ఉన్నాడని బీసీసీఐ తాజాగా ప్రకటించింది. గాయం కారణంగా తొలి టెస్టుకు దూరమైన అక్షర్.. ప్రస్తుతం పూర్తిగా కోలుకున్నాడు. దీంతో రెండో టెస్టు తుది జట్టులోకి అతడిని జట్టులోకి తీసుకునే అవకాశం ఉంది.
ఇక అంతకుముందు షాబాజ్ నదీమ్, రాహుల్ చాహర్‌ను తుది జాబితాకు ఎంపిక చేయగా ఇప్పుడు వారిని మళ్లీ స్టాండ్ బై ఆటగాళ్ల జాబితాలోకి చేర్చింది యాజమాన్యం. తొలి మ్యాచ్‌లో జట్టులో స్థానం దక్కుతుందనుకున్న కుల్దీప్కు నిరాశ తప్పలేదు. అనూహ్యంగా నదీమ్ అతని స్థానంలో టీమ్‌లోకి వచ్చాడు.అనుకోకుండా వచ్చిన అవకాశాన్ని ఈ యువ క్రికెటర్ సద్వినియోగం చేసుకోలేకపోయాడు. దీంతో రెండో టెస్టుకు అతడిని పక్కకు పెట్టినట్లు తెలుస్తోంది.
ఇండియా టీమ్: విరాట్ కోహ్లీ(కెప్టెన్), రోహిత్ శర్మ, మయాంక్ అగర్వాల్, శుభ్‌మన్ గిల్, ఛెతేశ్వర్ పుజారా, అజింక్య రహానె, కేఎల్ రాహుల్, హర్దిక్ పాండ్య, రిషభ్‌పంత్(వికెట్ కీపర్), వృద్ధిమాన్ సాహా, అశ్విన్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, ఇషాంత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్, శార్దూల్ ఠాకుర్.
స్టాండ్‌బై ఆటగాళ్లు: కేఎస్ భరత్, అభిమన్యు ఈశ్వరన్, షాబాజ్ నదీమ్, రాహుల్ చాహర్, ప్రియాంక్ పంచల్.
నెట్ బౌలర్లు: అంకిత్ రాజ్‌పుత్, అవేశ్ ఖాన్, సందీప్ వారియర్, కృష్ణప్ప గౌతమ్, సౌరభ్ కుమార్.
ఇదీ చదవండి: హ్యాండ్సమ్ క్రికెటర్లు.. అమ్మాయిల కలల రాకుమారులు!