ETV Bharat / sports

తొలి టెస్ట్: రూట్​ డబుల్ సెంచరీ.. ఇంగ్లాండ్ 555/8

తొలి టెస్టులో పర్యాటక జట్టు 555/8 పరుగుల భారీ స్కోరు చేసింది. కెప్టెన్ జో రూట్ డబుల్ సెంచరీకి తోడు బెన్​ స్టోక్స్, సిబ్లే అర్ధ శతకాలు చేశారు. తొలి రోజు తేలిపోయిన భారత బౌలర్లు రెండో రోజు చివరి సెషన్​లో ఇంగ్లాండ్​ను కట్టడి చేయగలిగారు.

ind vs eng first test first innings enlgand score
తొలి టెస్ట్: రూట్​ డబల్ సెంచరీ.. ఇంగ్లాండ్ 555/8
author img

By

Published : Feb 6, 2021, 4:54 PM IST

ఇంగ్లాండ్ సారథి జో రూట్(218, 377 బంతుల్లో) ద్విశతకంతో చెలరేగిన వేళ తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్​లో ఇంగ్లాండ్​ భారీ స్కోరు సాధించింది. 8 వికెట్లు కోల్పోయి 555 పరుగులు చేసింది. రూట్​ అద్భుత ప్రదర్శనకు తోడు డామ్ సిబ్లే(87), బెన్​ స్టోక్స్(82)​ అర్ధ శతకాలతో తొలి రెండు రోజులు పర్యాటక జట్టు పూర్తి ఆధిపత్యం సాధించింది.

ప్రస్తుతం క్రీజులో డామ్ బెస్(28*), జాక్ లీచ్(6*) ఉన్నారు. భారత బౌలర్లలో బుమ్రా, అశ్విన్​, ఇషాంత్ శర్మ, నదీమ్ తలొ 2 వికెట్లు తీశారు.

పుంజుకున్న భారత బౌలర్లు..

ఓవర్​నైట్​ స్కోరు 263 పరుగులతో బరిలోకి దిగింది ఇంగ్లాండ్. రూట్, స్టోక్స్​ భారత బౌలర్లకు దడపుట్టించారు. స్టోక్స్​ వేగంగా పరుగులు చేయగా, రూట్​ నిలకడగా క్రీజులో పాతుకుపోయాడు. అశ్విన్ వేసిన ఓవర్లో సిక్సర్​తో ద్విశతకం పూర్తి చేసుకున్నాడు. ఈ క్రమంలో నదీమ్​ బౌలింగ్​లో క్యాచ్​ ఇచ్చి స్టోక్స్​ వెనుదిరిగాడు.

ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన ఓలీ పోప్(34) కాసేపు కెప్టెన్​ రూట్​కు సహకారం అందిచినా 153వ ఓవర్లో అతడిని ఎల్​బీడబ్ల్యూగా అశ్విన్​ పెవీలియన్​కు చేర్చాడు. ఆ తర్వాత ఓవర్​లోనే కీలక వికెట్​ జో రూట్​ను ఔట్​ చేసి భారత్​కు ఉపశమనం కలిగించాడు నదీమ్. అక్కడినుంచి ఇంగ్లాండ్ వరుసగా వికెట్లు కోల్పోయింది.

ఇదీ చూడండి: చరిత్ర సృష్టించిన రూట్- 100వ మ్యాచ్​లో 200

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.