టీమ్ఇండియా ఓపెనర్ రోహిత్ శర్మ(103*) శతకం సాధించాడు. ఇంగ్లాండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో సిక్సర్‌తో మూడంకెల స్కోర్ అందుకున్నాడు. దాంతో టెస్టుల్లో విదేశీ గడ్డపై తొలి శతకం నమోదు చేశాడు. కేఎల్ రాహుల్(46)తో కలిసి శనివారం మూడో రోజు ఆట ప్రారంభించిన హిట్‌మ్యాన్ ఇంగ్లాండ్ బౌలర్లపై ఆధిపత్యం చెలాయిస్తున్నాడు. తొలి సెషన్‌లో కేఎల్ రాహుల్ ఔటైనా.. పుజారా(48*)తో కలిసి సాధికార ఇన్నింగ్స్ ఆడుతున్నాడు.
ఈ క్రమంలోనే రోహిత్.. 204 బంతుల్లో 12 ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో చాలా రోజుల తర్వాత సెంచరీ సాధించాడు. మొయిన్ అలీ వేసిన 63.5 ఓవర్‌కు బంతిని సిక్సర్‌గా మలిచి టెస్టుల్లో 8వ శతకం సాధించాడు. ప్రస్తుతం పుజారాతో కలిసి శతక భాగస్వామ్యంతో కొనసాగుతున్నాడు. ఇక రెండో సెషన్ పూర్తయ్యేసరికి టీమ్‌ఇండియా స్కోర్ 199/1గా నమోదైంది. దాంతో భారత్ 100 పరుగుల ఆధిక్యం సంపాదించింది. మరోవైపు హిట్‌మ్యాన్ సెంచరీ పూర్తి చేయగానే టీమ్‌ఇండియా బాల్కానీ చప్పట్లతో మార్మోగింది. కెప్టెన్ విరాట్ కోహ్లీ, రోహిత్ సతీమణి రితిక సంతోషంలో మునిగిపోయారు.
ఇదీ చూడండి.. IND Vs ENG: లంచ్ విరామానికి టీమ్ఇండియా 108/1