నాటింగ్‌హామ్‌లో భారత్‌తో జరుగుతున్న తొలి టెస్టులో టీ విరామ సమయానికి ఇంగ్లాండ్ 4 వికెట్ల నష్టానికి 138 పరుగులు చేసింది. టీమ్ఇండియా బౌలర్లలో షమి 2, బుమ్రా, సిరాజ్ తలో వికెట్ తీశారు. కెప్టెన్ రూట్(52*) హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు.
భోజన విరామ సమయానికి 61/2తో ఉన్న రూట్‌సేన నిలకడగా ఆడింది. రెండో సెషన్ ప్రారంభమైన కొద్దిసేపటికే సిబ్లీ(18) క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. ఆ తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన బెయిర్ స్టో సారథి రూట్‌కు సహకరించాడు. ఈ జోడీ నాలుగో వికెట్‌కు 72 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పింది. ప్రారంభంలో ఆచితూచి ఆడిన ఈ జోడీ క్రమంగా దూకుడు పెంచింది. చివర్లో చక్కటి బంతి ద్వారా షమి, బెయిర్ స్టోను పెవిలియన్‌కు పంపాడు.
రూట్ రికాార్డు పరుగులు
తొలి ఇన్నింగ్స్‌లో నిలకడగా ఆడుతున్న ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్.. సరికొత్త రికార్డు తన ఖాతాలో వేసుకున్నాడు. ఇంగ్లాండ్ తరఫున అన్ని ఫార్మాట్లలో కలిపి ఎక్కువ పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. అంతకుముందు అలెస్టర్ కుక్ పేరిట ఉన్న మార్క్‌ను అధిగమించాడు. కుక్ 15,737 పరుగులు చేయగా.. రూట్ ఈ మ్యాచ్‌లో 23 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అతన్ని దాటేశాడు.
బుమ్రా అరుదైన ఘనత..
టీమ్ఇండియా బౌలర్ జస్ప్రీత్ బుమ్రా అరుదైన రికార్డును సృష్టించాడు. ఇంగ్లాండ్ గడ్డమీద టెస్టుల్లో తొలి ఓవర్లోనే వికెట్ తీసిన తొలి బౌలర్‌గా ఘనత వహించాడు. తొలి ఓవర్ ఐదో బంతికి ఓపెనర్ రోరీ బర్న్స్‌ను వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు బుమ్రా.
ఇదీ చదవండి: అక్టోబర్ 24న భారత్- పాక్ మ్యాచ్