ETV Bharat / sports

డేనైట్​ టెస్టుల నిర్వహణపై బీసీసీఐ పునరాలోచన! - పింక్​ టెస్టు వార్తలు

పింక్​-బాల్​ టెస్టుల నిర్వహణపై భారత క్రికెట్​ నియంత్రణ మండలి (బీసీసీఐ) పునరాలోచనలో పడినట్లు తెలుస్తోంది. డేనైట్​ టెస్టులపై ఆటగాళ్లు తమ ఇబ్బందిని తెలియజేసిన నేపథ్యంలో బోర్డు ఆ దిశగా యోచిస్తున్నట్లు సమాచారం.

BCCI to rethink future of day-night Tests after Cricketers raise concerns over pink ball!
డేనైట్​ టెస్టుల నిర్వహణపై బీసీసీఐ పునరాలోచన!
author img

By

Published : Feb 28, 2021, 9:21 AM IST

డేనైట్​ టెస్టులపై బీసీసీఐ పునరాలోచనలో పడిందా? గులాబి బంతితో ఆడే విషయంలో ఆటగాళ్లు తమ ఇబ్బందిని తెలియజేసిన నేపథ్యంలో బోర్డు ఆ దిశగా యోచిస్తున్నట్లు సమాచారం. మోదీ స్టేడియంలో ఇంగ్లాండ్​తో మూడో టెస్టు అనంతరం.. గులాబి బంతితో ఆడటంలో తమ ఇబ్బందుల గురించి బోర్డుకు ఆటగాళ్లు విన్నవించినట్లు తెలిసింది.

"పిచ్​పై పడిన తర్వాత బంతి ఒక వేగంతో వస్తుందని బ్యాట్స్​మెన్​కు అంచనా ఉంటుంది. ఎర్ర బంతితో వాళ్లు అలాగే ఆడటానికి అలవాటుపడ్డారు. కానీ గులాబి బంతి వారు ఊహించని వేగంతో రావడం ఇబ్బందులకు గురి చేస్తోంది. ఇదే కాదు ఫ్లడ్​లైట్ల వెలుతురులో గులాబి బంతిని చూడడంలో సమస్య కూడా వారి ఆందోళనకు మరో కారణం."

- బీసీసీఐ అధికారి

పింక్​-బాల్​ పిచ్​ అయ్యాక వేగంగా వస్తోందని, దీనికి అలవాటు పడటం సవాలేనని అహ్మదాబాద్​లో టెస్టు అనంతరం రోహిత్​ అన్నాడు.

ఇదీ చూడండి: 'ఎలా ఆడాలో రోహిత్‌ చూపించాడుగా!'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.