టీమ్ఇండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా, స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌తో కలిసి 'మాస్టర్' సినిమాలోని 'వాతి కమింగ్' అనే పాటకు అశ్విన్ స్టెప్పులేశాడు. ఆ వీడియోను అశ్విన్ సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకున్నాడు. గంటలో 2 లక్షలకు పైగా వీక్షణలను దక్కించుకుంది ఆ వీడియో. ఇందులో తొలుత అశ్విన్ డాన్స్ స్టార్ట్ చేయగా.. అతడిని అనుసరిస్తూ.. హార్దిక్, కుల్దీప్ కాలు కదిపారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
చెపాక్ టెస్టులోనూ..
ఇంగ్లాండ్‌తో జరిగిన రెండో టెస్టులో ఫీల్టింగ్ చేస్తున్న సమయంలోనూ అశ్విన్ ఇదే విధంగా స్టెప్పులు వేశాడు. ఆ వీడియో వైరల్‌గా మారింది. దీంతో అభిమానులను ఉత్సాహపరిచేందుకు అశ్విన్ మరోసారి అదే పాటకు డాన్స్ చేసి వీడియోను సోషల్‌మీడియాలో పంచుకున్నాడు. ఈ వీడియోకు అశ్విన్ భార్య ప్రీతితో పాటు టీమ్ఇండియా ఫీల్టింగ్ కోచ్ ఆర్.శ్రీధర్, స్పిన్నర్ హర్భజన్ సింగ్ సహా పలువురు అభిమానులు కామెంట్లు చేశారు.
ఇదీ చూడండి: జాతీయ జట్టును కాదని ఐపీఎల్లో ఆడేందుకు..!