ETV Bharat / sports

Eng vs Pak: మూడో వన్డే ఇంగ్లాండ్​దే .. సిరీస్ క్లీన్​స్వీప్​

author img

By

Published : Jul 14, 2021, 10:15 AM IST

బర్మింగ్​హామ్​ వేదికగా ఇంగ్లాండ్-పాకిస్థాన్(England vs Pakistan)​ మధ్య జరిగిన మూడో వన్డేలో స్టోక్స్​ సేన 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఇప్పటికే తొలి రెండు మ్యాచ్​లు గెలిచిన ఆతిథ్య జట్టు.. తాజా విజయంతో క్లీన్​ స్వీప్​ చేసింది. జులై 16(శుక్రవారం) నుంచి ఇరుజట్ల మధ్య మూడు మ్యాచ్​ల టీ20 సిరీస్​ ప్రారంభం కానుంది.

england vs pakistan, james vince
ఇంగ్లాండ్ vs పాకిస్థాన్, జేమ్స్​ విన్స్​ సెంచరీ

బర్మింగ్​హామ్​ వేదికగా ఇంగ్లాండ్​తో జరిగిన మూడో వన్డేలో పాకిస్థాన్​కు పరాభవం తప్పలేదు. ఈ మ్యాచ్​ను స్టోక్స్​ సేన 3 వికెట్ల తేడాతో గెలుపొందింది. దీంతో మూడు మ్యాచ్​ల వన్డే సిరీస్​ (England vs Pakistan)ను ఇంగ్లాండ్​ క్లీన్​స్వీప్​ చేసింది. లక్ష్య ఛేదనలో సెంచరీతో కదం తొక్కిన జేమ్స్​ విన్స్​ (James Vince)కు మ్యాన్​ ఆఫ్ ది మ్యాచ్​ అవార్డు దక్కింది.

తొలుత బ్యాటింగ్​కు దిగిన పాకిస్థాన్​ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 331 పరుగులు చేసింది. తొలి రెండు మ్యాచ్​ల్లో విఫలమైన కెప్టెన్ బాబర్ అజామ్(139 బంతుల్లో 158 పరుగులు) (Babar Azam) ఎట్టకేలకు ఈ మ్యాచ్​లో భారీ సెంచరీ చేశాడు. అతడికి తోడు ఓపెనర్​ ఇమామ్​ ఉల్​ హక్​(73 బంతుల్లో 56 పరుగులు), మహ్మద్​ రిజ్వాన్(58 బంతుల్లో 74 పరుగులు) అర్ధ సెంచరీలు చేశారు. ఇంగ్లాండ్ బౌలర్లలో బ్రైడాన్​ కార్సే 5, సకిబ్​ మహ్మద్​ 3 వికెట్లతో మెరిశారు.

అనంతరం లక్ష్య ఛేదనలో బరిలోకి దిగిన ఇంగ్లాండ్​ మరో రెండు ఓవర్లు మిగిలుండగానే విజయాన్ని అందుకుంది. జేమ్స్​ విన్స్(95 బంతుల్లో 102 పరుగులు) సెంచరీకి తోడు లూయిస్​ గ్రెగోరీ(69 బంతుల్లో 77 పరుగులు) అర్ధ సెంచరీతో చేలరేగాడు. జాక్​ క్రావ్లే(39), ఫిల్​ సాల్ట్(37), బెన్​ స్టోక్స్​(32) ఫర్వాలేదనిపించారు. పాక్ బౌలర్లలో హరిస్ రౌఫ్​ 4, షాదబ్​ ఖాన్​ 2 వికెట్లతో రాణించారు.

జులై 16(శుక్రవారం) నుంచి ఇరుజట్ల మధ్య మూడు మ్యాచ్​ల టీ20 సిరీస్​ ప్రారంభమవుతుంది.

ఇదీ చదవండి: శ్రీలంక ఆటగాళ్లపై మురళీధరన్‌ ఫైర్‌

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.