ETV Bharat / sports

T20 World Cup: వెస్టిండీస్​పై ఇంగ్లాండ్​ ఘన విజయం - టీ20 ప్రపంచకప్​లో ఇంగ్లాండ్

టీ20 ప్రపంచకప్​లో(T20 World Cup 2021) వెస్టిండీస్​పై ఘన విజయం సాధించింది ఇంగ్లాండ్(ENG Vs WI t20). నిర్ణీత 20 ఓవర్లలో 55 పరుగులకే విండీస్​ బ్యాట్స్​మన్​ను కట్టడి చేసి.. 8.2 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది.

england
ఇంగ్లాండ్
author img

By

Published : Oct 23, 2021, 9:59 PM IST

Updated : Oct 23, 2021, 10:42 PM IST

టీ20 ప్రపంచకప్‌లో(T20 World Cup 2021) రెండుసార్లు ఛాంపియన్‌ అయిన వెస్టిండీస్‌కు ఓటమి స్వాగతం పలికింది. బ్యాటర్లు విఫలమైన వేళ.. బౌలర్లు రాణించినప్పటికీ ఇంగ్లాండ్‌(ENG vs WI t20) చేతిలో ఓటమి తప్పలేదు. తొలుత బ్యాటింగ్‌ చేసిన విండీస్‌ 55 పరుగులకే కుప్పకూలింది. స్వల్ప లక్ష్య ఛేదనలోనూ ఇంగ్లీష్ జట్టు తడబాటుకు గురైంది. ఛేదనలో 8.2 ఓవర్లలో నాలుగు వికెట్లను కోల్పోయి 56 పరుగులు చేసి విజయం సాధించింది. జేసన్ రాయ్‌ (11), బెయిర్‌స్టో (9), మొయిన్‌ అలీ (3), లివింగ్ స్టోన్ (1) స్వల్ప స్కోర్లకే వెనుదిరిగారు. జోస్ బట్లర్‌ (24*), మోర్గాన్ (7)* నాటౌట్‌గా నిలిచారు. విండీస్‌ బౌలర్లలో హోసైన్ 2, రవి రాంపాల్ ఒక వికెట్ తీశారు. లక్ష్యం చిన్నదైనా వెస్టిండీస్ బౌలర్లు ఏ మాత్రం వెనుకాడలేదు. కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో మ్యాచ్‌ రసవత్తరంగా మారింది. తొలుత బ్యాటింగ్‌లో మరికాస్త పరుగులు రాబట్టి ఉంటే విండీస్‌ గెలిచేందుకు అవకాశాలు ఉండేవి.

వచ్చిన దారినే వెళ్లారు..

క్రిస్‌ గేల్‌.. పొలార్డ్.. రసెల్.. పూరన్..హెట్​మెయర్.. బ్రావో.. వీళ్లంతా భారీ హిట్టర్లు. అలవోకగా సిక్సర్లను బాదేస్తారు. అలాంటిది విండీస్‌ ఇన్నింగ్స్‌లో మొత్తం ఒక్కటంటే ఒక్కటే సిక్సర్‌ నమోదు కావడం గమనార్హం. అదీ లూయిస్ (6) కొట్టినదే. విండీస్‌ జట్టులో క్రిస్‌ గేల్ (13) ఒక్కడే టాప్ స్కోరర్. మిగతా బ్యాటర్లలో సిమన్స్ (3), హెట్​మెయర్ (9), బ్రావో (5), పూరన్ (1), పొలార్డ్ (6), హోసైన్ (6*), రాంపాల్ (3) స్వల్ప రెండంకెల స్కోరు కూడా చేయలేకపోయారు. ఇంగ్లాండ్ బౌలర్‌ అదిల్ రషీద్‌ (4/2) విజృంభణతో విండీస్‌ కుప్పకూలింది. కీలకమైన వికెట్లు పడగొట్టి విండీస్‌ పతనాన్ని అతడు శాసించాడు. ఇంగ్లాండ్ బౌలర్లలో మిల్స్ 2, మొయిన్ 2.. జొర్డాన్, క్రిస్ వోక్స్ చెరో వికెట్ తీశారు.

ఇదీ చదవండి:

T20 Worldcup: ఆసీస్ బోణీ.. సౌతాఫ్రికాపై విజయం

Last Updated : Oct 23, 2021, 10:42 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.