Joe Root Ashes Record : యాషెస్ సిరీస్‌లో భాగంగా జరుగుతున్న మ్యాచుల్లో ఎన్నో ఆసక్తికరమైన ఘటనలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఇంగ్లాండ్ స్టార్ క్రికెటర్ జో రూట్ ఓ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకుని అందరిని ఆశ్చర్యపరిచాడు. ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టులోని తొలి ఇన్నింగ్స్‌లో శతకాన్ని బాదిన రూట్.. రెండో ఇన్నింగ్స్‌లో 46 పరుగులు చేసి స్టంపౌట్‌గా వెనుదిరిగాడు. అయితే తన టెస్టు కెరీర్‌లో రూట్ స్టంప్ అవుట్‌గా వెనుదిరగడం ఇదే తొలిసారి. ఈ క్రమంలో ఔటయ్యి కూడా జో ఓ రికార్డు అందుకున్నాడు.
టెస్టు కెరీర్‌లో 130 టెస్టులాడి 11,168 పరుగులు చేసిన ఈ యంగ్ ప్లేయర్.. తొలిసారి స్టంప్ ఔట్ అయ్యాడు. దీంతో 11 వేలకు పైగా పరుగులు చేసి.. తొలిసారి స్టంప్ ఔట్ అయిన రెండో ఆటగాడిగా చరిత్రకెక్కాడు. ఇక తొలి స్థానంలో వెస్టిండీస్ మాజీ ఓపెనర్ శివ నారాయణ్ చందర్‌పాల్ 11,414 పరుగులు ఉండగా.. మూడో స్థానంలో దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ గ్రేమ్ స్మిత్ ఉన్నాడు. స్మిత్ 8800 పరుగులు చేసిన తర్వాత స్టంపౌట్ అయ్యాడు. ఇక టీమ్ఇండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ 8195 పరుగులతో నాలుగో స్థానంలో ఉండగా.. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ 7419 పరుగులు చేసిన తర్వాత స్టంపౌట్ అయి 5వ స్థానంలో ఉన్నాడు.
-
After 11,168 runs, Joe Root has been stumped for the first time in Tests!
— ESPNcricinfo (@ESPNcricinfo) June 19, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
(h/t @sirswampthing) #Ashes pic.twitter.com/X1XackGAYa
">After 11,168 runs, Joe Root has been stumped for the first time in Tests!
— ESPNcricinfo (@ESPNcricinfo) June 19, 2023
(h/t @sirswampthing) #Ashes pic.twitter.com/X1XackGAYaAfter 11,168 runs, Joe Root has been stumped for the first time in Tests!
— ESPNcricinfo (@ESPNcricinfo) June 19, 2023
(h/t @sirswampthing) #Ashes pic.twitter.com/X1XackGAYa
ఐతే టెస్టు క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసి ఒక్కసారి కూడా స్టంపౌట్ కాని ఆటగాడిగా శ్రీలంక మాజీ కెప్టెన్ మహేల జయవర్థనె చరిత్రకెక్కాడు. టెస్టుల్లో 11,814 పరుగులు చేసిన జయవర్థనె. ఒక్కసారి స్టంపౌట్ కాకపోవడం విశేషం. జో రూట్ కూడా దాదాపుగా జయవర్దనేకు దగ్గరగానే వచ్చాడు. అయితే 600లకు పైగా పరుగుల దూరంలో నిలిచాడు.