ETV Bharat / sports

England vs India: టెస్టుల్లో ఇంగ్లాండ్ జట్టు డకౌట్ల రికార్డు!

author img

By

Published : Aug 28, 2021, 8:47 AM IST

Updated : Aug 28, 2021, 9:31 AM IST

విజయవంతమైన క్రికెట్​ జట్లలో ఇంగ్లాండ్​(England) టీమ్ ఒకటి అనడంలో ఎలాంటి సందేహం లేదు​. కానీ, ఆ జట్టు ఓ చెత్త రికార్డును మరోసారి తన ఖాతాలో వేసుకునేలా కనిపిస్తోంది. సుదీర్ఘ ఫార్మాట్లో రెండో అత్యధిక డకౌట్లు నమోదు చేశారు ఆ జట్టు బ్యాట్స్​మెన్.​

England Team
ఇంగ్లాండ్ టీమ్

టెస్టుల్లో(Test Cricket) ఇంగ్లాండ్​ ఓ చెత్త రికార్డు తన ఖాతాలో వేసుకునేలా కనిపిస్తోంది. ఆ జట్టు బ్యాట్స్​మెన్​ అత్యధిక డకౌట్ల ఫీట్​ను రెండోసారి నమోదు చేశారు. ఈ ఏడాది ఆ టీమ్​లోని ఆటగాళ్లు 40 సార్లు డకౌట్​గా వెనుదిరిగారు. 1998లో ఆ జట్టు ప్లేయర్లు అత్యధికంగా 54 సార్లు​ పరుగులేమి చేయకుండానే పెవిలియన్​ చేరారు. ఈ క్యాలెండర్​ ఇయర్​లో మరోసారి ఈ ఊహించని ఫీట్​ నమోదు చేసేలా ఉంది ఇంగ్లిష్ బృందం.

ప్రస్తుతం టీమ్ఇండియాతో(Team India) సొంతగడ్డపై ఇంగ్లాండ్ ఐదు మ్యాచ్​ల టెస్టు సిరీస్​ ఆడుతుంది. 1-0తో వెనుకబడింది. తొలి టెస్టులో ఆ జట్టులోని ఐదుగురు ఆటగాళ్లు డకౌట్​ అయ్యారు. లార్డ్స్​ టెస్టులో రెండు ఇన్నింగ్స్​ల్లో కలిపి మొత్తం ఏడుగురు బ్యాట్స్​మెన్​ సున్న పరుగులకే ఔటయ్యారు. మూడో టెస్టులో ఒక బ్యాట్స్​మన్​ పరుగులేమీ చేయకుండా పెవిలియన్​ చేరాడు. 1986, 2001, 2013లలో వరుసగా 33 సార్లు చొప్పున ఆ జట్టు ఆటగాళ్లు డకౌట్లుగా వెనుదిరిగిన చరిత్ర ఉంది.

ఇదీ చదవండి: IND vs ENG: ముగిసిన మూడో రోజు ఆట.. టీమ్ఇండియా 215/2

Last Updated : Aug 28, 2021, 9:31 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.