ETV Bharat / sports

టీమ్​ఇండియాపై ఇంగ్లాండ్ కోచ్ ఘాటు వ్యాఖ్యలు

author img

By

Published : Aug 18, 2021, 1:46 PM IST

లార్డ్స్​ టెస్టు ఓటమిపై ఇంగ్లాండ్ కోచ్​ క్రిస్ సిల్వర్ హుడ్ ఘాటు వ్యాఖ్యలు చేశాడు. చిన్న చిన్న విషయాలకు తమ ఆటగాళ్లు భయపడాల్సిన అవసరం లేదని అన్నాడు. భారత్-ఇంగ్లాండ్​ మధ్య మూడో టెస్టు ఆగస్టు 25 నుంచి మొదలుకానుంది.

ఇంగ్లాండ్ కోచ్
ఇంగ్లాండ్ కోచ్

లార్డ్స్​ టెస్టులో చారిత్రక విజయాన్ని అందుకున్న టీమ్​ఇండియా.. మూడో టెస్టుకు సన్నద్ధమవుతోంది. ఈ సమయంలో ఇంగ్లాండ్ కోచ్ క్రిస్ సిల్వర్‌వుడ్ రెండో టెస్టు గురించి మాట్లాడాడు. భారత్ తమ జట్టును వెనక్కి నెడితే.. తామూ అంతే దీటుగా వారిని వెనక్కి నెడతామని అన్నాడు.

లార్డ్స్‌ టెస్టు చివరిరోజు సందర్భంగా ఇరుజట్ల ఆటగాళ్ల మధ్య మాటలు ఎక్కువయ్యాయని సిల్వర్‌వుడ్ చెప్పాడు. అయితే వీటిని మ్యాచ్ గెలుపునకు ఉపయోగించాలని కోరుకుంటున్నట్లు స్పష్టం చేశాడు. రెండో టెస్టులో తమ కుర్రాళ్లు గెలిచేవాళ్లని తెలిపాడు. టీమ్​ఇండియా ఓటమి తప్పించుకునే ఆశతోనే చివరి రోజు ఆటను మొదలుపెట్టిందని సిల్వర్‌వుడ్ అన్నాడు. అయితే ఆఖర్లో వచ్చిన జస్ప్రీత్ బుమ్రా-మహమ్మద్ షమి ద్వయం మ్యాచ్‌ని మలుపు తిప్పిందని తెలిపాడు. ఇలాంటి చిన్న చిన్న విషయాలకే ఇంగ్లాండ్ ఆటగాళ్లు భయపడాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించారు.

"ఈ మ్యాచ్​ ఫలితంతో మేం నిరాశ చెందినప్పటికీ.. టెస్టు క్రికెట్‌లోని మజాను ఆస్వాదించాను. కానీ కొంత బాధగానే ఉంది. వారివారి దేశాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆటగాళ్లు రెండింతల గర్వాన్ని కనబర్చారు. నేను దానిని ఆస్వాదించాను. భావోద్వేగాలు ఎక్కువయ్యాయి. అందులో ఎలాంటి సందేహం లేదు."

-ఇంగ్లాండ్ కోచ్ క్రిస్ సిల్వర్‌వుడ్

ఆగస్టు 25 నుంచి హెడింగ్లీలో మూడో టెస్టు జరగనుంది. తొలి టెస్టు వర్షం కారణంగా డ్రా కాగా, ఇటీవల జరిగిన రెండో టెస్టులో భారత్ గెలిచింది. ప్రస్తుతం సిరీస్​లో 1-0 ఆధిక్యంలో ఉంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.