టీమ్ఇండియా-ఇంగ్లాండ్(team india england tour) మధ్య జరుగుతున్న సిరీస్‌లో ఇరు జట్ల పోరాట తీరు చూసి ముగ్ధుడయ్యాడు బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ. గతంలోనూ ఇరు జట్లు మైదానంలో గొప్ప నైపుణ్యాన్ని ప్రదర్శించాయని అన్నాడు. ఈ సిరీస్‌కు ముందు ఆస్ట్రేలియా-టీమ్ఇండియా మధ్య ఉత్కంఠంగా జరిగిన సిరీస్‌ను గుర్తుచేసుకున్నాడు. రసవత్తరంగా సాగే ఇలాంటి టెస్ట్ సిరీస్‌లకు మించి ఇంకొకటి ఉండదని అన్నాడు. ప్రస్తుతం జరుగుతున్న నాలుగో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో భారత జట్టు అద్భత ప్రదర్శన చేస్తోంది. ఈ నేపథ్యంలోనే టీమ్ఇండియాను ప్రశంసిస్తూ ఇలా అన్నాడు దాదా.
"ఇది ఉత్తమమైన క్రికెట్. పోటాపోటీగా సాగే ఇలాంటి టెస్టు సిరీస్‌కు ఏదీ సాటి రాదు. ఇది వరకు ఆస్ట్రేలియాలో.. ఇప్పుడు ఇక్కడ. అత్యంత నైపుణ్యమైన క్రికెట్ ఇది"
-గంగూలీ, బీసీసీఐ అధ్యక్షుడు.
నాలుగో టెస్టు నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్‌లో 77/0 పరుగులు చేసింది. విజయానికి ఆ జట్టు మరో 291 పరుగులు దూరంలో ఉంది. ఇక తొలి ఇన్నింగ్స్‌లో 191 పరుగులకు ఆలౌట్ అయిన భారత జట్టు రెండో ఇన్నింగ్స్‌లో 466 రన్స్ చేసింది. ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 290 పరుగులు చేసింది. మొత్తంగా ఐదు మ్యాచ్‌లతో కూడిన సిరీస్‌లో ఇరు జట్లు 1-1తో సమంగా ఉన్నాయి.
ఈ సిరీస్‌కు ముందు ఆస్ట్రేలియాలో(teamindia australia series) ఆడిన టెస్టు సిరీస్‌లో చరిత్రాత్మక విజయాన్ని అందుకుంది టీమ్ఇండియా. 2-1తేడాతో సిరీస్‌ను సొంతం చేసుకుంది.
ఇదీ చూడండి: గోడను బాది, హెల్మెట్ విసిరి కోహ్లీ ఫ్రస్ట్రేషన్