ETV Bharat / sports

IPL 2022: అక్టోబర్ 17న కొత్త జట్ల కోసం ఈ-బిడ్డింగ్! - బీసీసీఐ

వచ్చే సీజన్​ నుంచి 10 జట్లతో ఐపీఎల్ (Ipl 2022) జరిగే అవకాశం ఉంది. కొత్తగా రానున్న రెండు జట్ల కోసం ఇప్పటికే బిడ్లను ఆహ్వానించిన బీసీసీఐ.. అక్టోబర్ 17న ఈ-బిడ్డింగ్ నిర్వహించాలని భావిస్తోంది.

new ipl team
ఐపీఎల్
author img

By

Published : Sep 14, 2021, 5:51 PM IST

Updated : Sep 14, 2021, 6:37 PM IST

ఐపీఎల్ (Ipl 2022)​ కొత్త జట్ల కోసం అక్టోబర్ 17న ఈ-బిడ్డింగ్ (Ipl new team 2022 auction) నిర్వహించాలని బీసీసీఐ యోచిస్తోంది. అక్టోబర్​ 5వరకు బిడ్లు దాఖలు చేసేందుకు అవకాశం ఉంది. ఆగస్టు 31న బిడ్లకు ఆహ్వానం పలికింది బీసీసీఐ.

"2022 సీజన్ నుంచి కొత్తగా ప్రతిపాదించిన రెండు జట్లలోని ఒకదానిని సొంతం చేసుకొని, నిర్వహించుకునేందుకు ఐపీఎల్ పాలకమండలి బిడ్లను ఆహ్వానిస్తోంది." అని గతంలో బీసీసీఐ ఓ ప్రకటన విడుదలచేసింది.

కొత్త ఫ్రాంచైజీల రేసు(Ipl 2022 new teams)లో అహ్మదాబాద్, లఖ్​నవూ, పుణె ముందు వరుసలో ఉన్నాయి. అహ్మదాబాద్​లోని నరేంద్ర మోదీ స్టేడియం, లఖ్​నవూలోని ఏకనా స్టేడియాలు భారీ సామర్థ్యంతో కూడుకున్నవి. దీంతో ఈ రెండు పట్టణాల పేర్లు కొత్త ఫ్రాంచైజీలకు అనువుగా ఉన్నాయి.

ఇక కంపెనీల విషయానికొస్తే అదానీ, ఆర్​పీజీ సంజీవ్ గోయంక గ్రూప్, టొరెంట్ ఫార్మాతో పాటు మరికొన్ని సంస్థలు బిడ్​ దాఖలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నాయని తెలుస్తోంది.

ఇదీ చూడండి: IPL 2022: కొత్త జట్ల కనీస ధర పెంపు.. బోర్డుకు కాసుల వర్షమే!

Last Updated : Sep 14, 2021, 6:37 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.