ETV Bharat / sports

Bravo Record: టీ20ల్లో బ్రావో సరికొత్త రికార్డు

ఐపీఎల్, సీపీఎల్ తదితర టీ20 లీగుల్లో ఆల్​రౌండర్​గా అదరగొడుతున్న బ్రావో.. ఈ ఫార్మాట్​లో సరికొత్త రికార్డు సృష్టించాడు. పొలార్డ్​ తర్వాత ఆ ఘనత సాధించిన వాడిగా నిలిచాడు. ఇంతకీ ఏంటా రికార్డు?

author img

By

Published : Sep 16, 2021, 9:31 AM IST

Dwayne Bravo
బ్రావో

స్టార్ ఆల్​రౌండర్​ డ్వేన్ బ్రావో అలియాస్ డీజే బ్రావో.. టీ20ల్లో సరికొత్త రికార్డు నెలకొల్పాడు. ఈ ఫార్మాట్​లో 500 మ్యాచ్​లాడిన రెండో ఆటగాడిగా నిలిచాడు. అంతకుముందు కీరన్ పొలార్డ్ ఈ ఘనత సాధించాడు.

బుధవారం జరిగిన సీపీఎల్​ ఫైనల్​లో సెయింట్ కీట్స్ అండ్ నెవిస్ పేట్రియట్​కు కెప్టెన్సీ వహించిన బ్రావో.. ఈ మార్క్​ను అందుకున్నాడు. ఈ మ్యాచ్​లో ఈ జట్టే విజేతగా నిలిచింది. తొలిసారి కప్పును ముద్దాడింది.

2006లో టీ20 అరంగేట్రం చేసిన బ్రావో.. ప్రపంచవ్యాప్తంగా వివిధ జట్లు, పలు లీగ్​ల్లోని వివిధ ఫ్రాంచైజీల తరఫున ఆడాడు. టీ20 స్పెషలిస్ట్​గా పేరు తెచ్చుకున్న ఇతడు.. 2010లో చివరగా టెస్టు.. 2017లో చివరగా వన్డే ఆడటం కాస్త ఆశ్చర్యం కలిగించే విషయం.

Dwayne Bravo dhoni
ధోనీతో డ్వేన్ బ్రావో

చెన్నై సూపర్​కింగ్స్, ముంబయి ఇండియన్స్, గుజరాత్ లయన్స్, చిట్టగాంగ్ కింగ్స్, లాహోర్ కలందర్స్, మెల్​బోర్న్ రెనెగేడ్స్, మెల్​బోర్న్ స్టార్స్, పార్ల్ రాక్స్, ట్రిన్​డాడ్ అండ్ టొబాగో, సిడ్నీ సిక్సర్స్ తదితర జట్లలో టీ20 మ్యాచ్​లు ఆడాడు బ్రావో.

37 ఏళ్ల బ్రావో.. 500 టీ20 మ్యాచ్​ల్లో 6566 పరుగులు చేశాడు. 540 వికెట్లు తీశాడు. అత్యధిక స్కోరు 70, అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శన 23/5.

ఐపీఎల్​లో చెన్నైసూపర్​కింగ్స్​కు ఆడుతున్న బ్రావో.. త్వరలో యూఏఈ వేదికగా జరిగే టోర్నీలో పాల్గొంటాడు. ఈ టోర్నీలో ఇప్పటివరకు 144 మ్యాచ్​లాడి 1510 పరుగులు చేయడం సహ 156 వికెట్లు పడగొట్టాడు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.