DRS Controversy: డీఆర్‌ఎస్ వివాదంపై దక్షిణాఫ్రికా బ్రాడ్‌కాస్టర్ సూపర్‌స్పోర్ట్ స్పందించింది. దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో టెస్టు మ్యాచ్‌లో డీఆర్‌ఎస్ నిర్ణయంపై భారత సారథి విరాట్ కోహ్లీ, వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్, బౌలర్ రవిచంద్రన్ అశ్విన్ స్టంప్ మైక్ వద్ద చేసిన వ్యాఖ్యలు వివాదస్పదమయ్యాయి. ఈ క్రమంలో సూపర్‌స్పోర్ట్ వివరణ ఇచ్చింది. "టీమ్‌ఇండియా ఆటగాళ్ల కామెంట్లను నోట్ చేసుకున్నాం. బాల్ ట్రాకింగ్ కోసం వినియోగించే హాక్-ఐ టెక్నాలజీ స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సర్వీస్ ప్రొవైడర్, దీనిని ఐసీసీ అప్రూవ్ చేసింది. అంతేకానీ హాక్-ఐ టెక్నాలజీ నియంత్రణ మా చేతుల్లో లేదు" అని స్పష్టం చేసింది.
ఇదే విషయంపై మాట్లాడేందుకు విరాట్ కోహ్లీ నిరాకరించాడు. దీనిని వివాదాస్పదం చేయడం ఇష్టం లేదని పేర్కొన్నాడు. నిన్న ఆఖరి టెస్టు మ్యాచ్ అనంతరం విలేకర్లతో మాట్లాడుతూ.. "నేను ఎలాంటి కామెంట్లు చేయను. మ్యాచ్ సందర్భంగా చేసిన వ్యాఖ్యలపై స్పందించి మరోసారి కాంట్రవర్సీ చేయాలనే ఆసక్తి నాకు లేదు. ఆ సమయంలో అలా జరిగిపోయింది. ఆ తర్వాత ఆట మీద దృష్టిసారించి వికెట్ల కోసం ప్రయత్నించాం" అని తెలిపాడు. నిర్ణయాత్మకమైన మూడో టెస్టు మ్యాచ్‌ను ఓడిపోవడంతో సహా భారత్ సిరీస్‌నూ చేజార్చుకుంది.
ఇదీ చదవండి: