ETV Bharat / sports

టీమ్​ఇండియా 'డీఆర్​ఎస్ వివాదం'పై ఐసీసీ ఆరా.. కానీ.. - DRS issue cape town controversy

DRS Controversy IND VS SA: దక్షిణాఫ్రికాతో మూడో టెస్టులో డీఆర్​ఎస్​ నిర్ణయంపై, టీమ్​ఇండియా వ్యవహరించిన తీరుపై ఎలాంటి అధికారిక చర్యలు చేపట్టలేదు ఐసీసీ. అయితే.. డీఆర్​ఎస్ నిర్ణయం తర్వాత కోహ్లీసేన మైదానంలో చేసిన వ్యాఖ్యలపై ఐసీసీ ఆరా తీస్తున్నట్లు సమాచారం.

IND VS SA
టీమ్​ఇండియా సౌతాఫ్రికా టెస్టు
author img

By

Published : Jan 15, 2022, 10:15 AM IST

DRS Controversy IND VS SA: భారత్​, దక్షిణాఫ్రికా మధ్య మూడో టెస్టులో భాగంగా నిర్ణయ సమీక్ష పద్ధతి(డీఆర్​ఎస్) వ్యవహారం నేపథ్యంలో.. టీమ్ఇండియాపై అధికారికంగా ఐసీసీ.. ఎలాంటి చర్యలు తీసుకోనట్లు సమాచారం. అయితే డీఆర్​ఎస్​ నిర్ణయం తర్వాత టీమ్ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్.. మైదానంలో వ్యవహరించిన తీరుపై ఐసీసీ.. ఆరా తీస్తోంది. ఈ మేరకు మ్యాచ్​ నిర్వహకులతో చర్చించినట్లు సమాచారం.

దక్షిణాఫ్రికాతో చివరి టెస్టు మూడో రోజు ఆటలో అశ్విన్‌ బౌలింగ్‌లో ఎల్గర్‌ సమీక్షలో నాటౌట్‌గా తేలడమే అందుకు కారణం. ఇదే విషయంపై టీమ్​ఇండియా సారథి కోహ్లీ స్పందిస్తూ.. 'నేను దీనిపై కామెంట్స్ చేయాలనుకోవడం లేదు. మైదానంలో ఏం జరిగిందో నాకు తెలుసు. కానీ ఫీల్డ్​ అవతల ఉన్నవారికి మాత్రం ఏం జరిగిందో కచ్చితంగా తెలియదు. అందుకే మైదానంలో మేము చేసినదానికి వివరణ ఇచ్చేందుకు ప్రయత్నించాం.' అని చెప్పాడు.

జరిగింది ఇదే..

సఫారీ రెండో ఇన్నింగ్స్‌ 21వ ఓవర్లో ఎల్గర్‌ ఎల్బీ కోసం జట్టు అప్పీల్‌ చేసింది. మైదానంలో ఉన్న అంపైర్‌ ఎరాస్మస్‌ ఔటిచ్చాడు. కానీ సమీక్ష కోరిన ఎల్గర్‌ కూడా రిప్లేలో మొదట బంతి గమనాన్ని చూసి పెవిలియన్‌ బాట పట్టాడు. కానీ చివరకు బంతి వికెట్ల మీద నుంచి వెళ్తున్నట్లు తేలింది. దీంతో అతను తిరిగొచ్చి బ్యాటింగ్‌ కొనసాగించాడు. ఒక్కసారిగా స్టంప్స్‌ పై నుంచి బంతి వెళ్తుందని సమీక్షలో చూపించడం వల్ల కోహ్లీ అసహనం వ్యక్తం చేశాడు.

అది కీలక వికెట్‌ కావడంతో దక్షిణాఫ్రికా అధికార ప్రసారదారైన సూపర్‌ స్పోర్ట్‌ను ఉద్దేశించి స్టంప్‌ మైక్‌ దగ్గరకు వెళ్లి వ్యాఖ్యలు చేశాడు.

"బంతికి మెరుగు పెడుతున్నపుడు.. కేవలం ప్రత్యర్థి పైనే కాదు మీ జట్టుపైనా దృష్టి పెట్టాలి. ఎప్పుడూ ప్రత్యర్థి ఆటగాళ్లను పట్టుకోవాలని చూస్తారు"అని అతనన్నాడు.

ఆ వెంటనే.. "పదకొండు మందికి వ్యతిరేకంగా మొత్తం దేశం ఉంది" అని కేఎల్‌ రాహుల్‌ అనడం వినిపించింది. "సూపర్‌స్పోర్ట్‌.. మీరు గెలవాలంటే మెరుగైన మార్గాన్ని ఎంచుకోండి"అని అశ్విన్‌ మాట్లాడాడు.

ఇదీ చూడండి:

'ముందు వాటిపై దృష్టిపెట్టు'.. కోహ్లీకి నెటిజన్ల చురకలు

టీమ్​ఇండియా విచిత్రమైన రికార్డు.. టెస్టులో 20 వికెట్లు క్యాచ్​ అవుట్​లే

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.