ETV Bharat / sports

WTC Final: పంత్​ క్యాచ్​ వదిలేశాక భయమేసింది!

author img

By

Published : Jul 2, 2021, 5:36 AM IST

టెస్టు ఛాంపియన్​షిప్​ ఫైనల్​(WTC Final) మ్యాచ్​లోని రెండో ఇన్నింగ్స్​లో టీమ్​ఇండియా బ్యాట్స్​మన్​ రిషబ్​ పంత్​ క్యాచ్​ వదిలేయడం పట్ల కివీస్​ బౌలర్​ సౌథీ విచారం వ్యక్తం చేశాడు. అయితే పంత్​ ఆ తర్వాత కొద్దిసేపటికే ఔట్​ అవ్వడం వల్ల తాను ఊపిరిపీల్చుకున్నట్లు తెలిపాడు. ఒకవేళ పంత్​ క్రీజ్​లో అలానే కొనసాగి ఉంటే మ్యాచ్​ ఫలితం మరోలా ఉండేదని సౌథీ అభిప్రాయపడ్డాడు.

Dropping Rishabh Pant's catch was like dropping WTC title, Says New Zealand Pacer Tim Southee
WTC Final: పంత్​ క్యాచ్​ వదిలేశాక భయమేసింది!

ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్​(WTC Final) రెండో ఇన్నింగ్స్‌లో రిషభ్ పంత్‌ క్యాచ్‌ వదిలేసినప్పుడు మ్యాచ్‌ చేజారిపోతుందని భయపడ్డానని న్యూజిలాండ్‌ పేసర్‌ టిమ్‌ సౌథీ అన్నాడు. అప్పటికే మ్యాచ్‌ అత్యంత కఠినంగా సాగుతోందని అతడు పేర్కొన్నాడు. ఐదారు ఓవర్లలోనే మ్యాచ్​ గమనాన్నే మలుపు తిప్పగల సామర్థ్యం పంత్​కు ఉందని సౌథీ అభిప్రాయపడ్డాడు.

"ఆ క్యాచ్‌ గురించి నేను బాధపడలేదంటే అవాస్తవమే అవుతుంది. ఎందుకంటే పంత్‌ ఎంత విధ్వంసకరంగా ఆడతాడో అందరికీ తెలుసు. అతడు ఐదారు ఓవర్లలో మ్యాచ్​ను మా నుంచి లాగేసుకోగలడు. అప్పటికే మ్యాచ్‌ హోరాహోరీగా సాగుతోంది. నా బుర్రలో ఎన్నో చెడు ఆలోచనలు తిరిగాయి. కానీ తర్వాతి ఓవర్‌ వేయాలంటే వాటి గురించి పట్టించుకోవద్దు. ఆ తర్వాత పంత్‌ ఔటయ్యాక ఊపిరి పీల్చుకున్నా. అదో భయంకరమైన అనుభవం. క్యాచులు వదిలేయడం క్రికెటర్‌ కెరీర్‌లోనే ఘోరమైంది. అలా చేయడం మన సహచరులను అవమాన పరిచినట్టే అనిపిస్తుంది".

- టిమ్​ సౌథీ, న్యూజిలాండ్​ పేసర్​

టెస్టు ఛాంపియన్​షిప్​ ఫైనల్​(WTC Final 2nd Innings) రెండో ఇన్నింగ్స్‌లో పంత్‌ ఐదు పరుగుల వద్ద ఉన్నప్పుడు ఔటయ్యే ప్రమాదం తప్పించుకున్నాడు. కైల్‌ జేమీసన్‌ వేసిన 40వ ఓవర్‌ ఆఖరి బంతి పంత్‌ బ్యాటు అంచుకు తగిలి స్లిప్‌లోకి వెళ్లింది. అప్పుడు రెండో స్లిప్‌లో ఉన్న సౌథీ ఫస్ట్‌ స్లిప్‌లో ఫీల్డర్‌ ముందు కుడివైపు డైవ్‌ చేశాడు. కానీ బంతి అతడి చేజారింది. అయితే రెండో ఇన్నింగ్స్‌లో టీమ్‌ఇండియా తరఫున అత్యధిక పరుగులు చేసింది పంత్‌ (41) మాత్రమే. అతడు మరో గంటసేపు క్రీజ్​లో నిలిచుంటే పరిస్థితి మరోలా ఉండేదేమో!

ఇదీ చూడండి.. పాండ్యాకు కపిల్ చురకలు.. ఏమన్నారంటే?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.