Raghavendra Rao: ఆయనో తెలుగు సినీ మహర్షి. పాటకు పట్టాభిషేకం చేసిన రాజర్షి. ఆయన పాటలు సన్నజాజులు. తెరపై విరబూసిన విరజాజులు. ఆయన ప్రస్థానమే ఓ చరిత్ర. ప్రేక్షకుల పల్స్ తెలిసిన ఇంద్రజాలికుడు.. బాక్సాఫీసు బద్దలు కొట్టిన దర్శకేంద్రుడు. ఆయనెవరో కాదు కోవెలమూడి రాఘవేంద్రరావు.
వందకుపైగా చిత్రాలకు దర్శకత్వం వహించి, ఎందరో నటులను స్టార్‌లుగా మార్చిన ఆయన గురించి పలు ఆసక్తికర విశేషాలు పంచుకునేందుకు ఈవారం 'వెండితెర వేల్పులు' కార్యక్రమం సిద్ధమైంది. ఆ'దర్శకేంద్రుడి' స్పెషల్ ఎపిసోడ్ 'ఈటీవీ' వార్త ఛానళ్లలో ఈ ఆదివారం ఉదయం 10.30 గంటలకు, సాయంత్రం 6.30 లకు, రాత్రి 10.30 గం.లకు ప్రసారం కానుంది. తప్పకచూడండి.
ఇదీ చూడండి: 'ఆర్ఆర్ఆర్' సక్సెస్‌పై రామ్‌చరణ్ ట్వీట్.. ఓటీటీలో 'వలిమై' రికార్డు