ETV Bharat / sports

కేఎల్​ రాహుల్​, సుందర్​ ఎందుకలా చేశారో అర్థం కాలేదు: దినేశ్​ కార్తిక్​ - వాషింగ్టన్ సుందర్​ మిస్సింగ్ క్యాచ్​

బంగ్లాదేశ్‌తో తొలి వన్డేలో టీమ్‌ఇండియా ఓడిపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేసిన దినేశ్​ కార్తిక్​.. కేఎల్ రాహుల్​, వాషింగ్టన్​ సుందర్​ మిస్సింగ్ క్యాచ్​పై కామెంట్స్ చేశాడు. ఏమన్నాడంటే..

Dinesh Karthik reacts on kl rahul sundar missing catch
కేఎల్​ రాహుల్​, సుందర్​ ఎందుకలా చేశారో అర్థం కాలేదు: దినేశ్​ కార్తిక్​
author img

By

Published : Dec 5, 2022, 11:29 AM IST

బంగ్లాదేశ్‌తో తొలి వన్డేలో టీమ్‌ఇండియా ఓటమిపై సీనియర్‌ వికెట్‌ కీపర్‌ దినేశ్‌ కార్తిక్‌ అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఇంత దారుణమైన ఫీల్డింగ్‌ను తాను ఊహించలేదని విమర్శించాడు. కేఎల్ రాహుల్‌ సంగతి పక్కనపెడితే.. వాషింగ్టన్‌ సుందర్‌ కనీసం క్యాచ్‌ పట్టేందుకు ప్రయత్నించకపోవడం తనను ఆశ్చర్యానికి గురిచేసిందన్నాడు.

"అవును, చివరి ఓవర్‌లో కేఎల్‌ రాహుల్‌ క్యాచ్‌ను వదిలేశాడు. కానీ, సుందర్‌ బంతిని క్యాచ్‌ పట్టేందుకు ఎందుకు ముందుకు రాలేదో అర్థం కాలేదు. అక్కడున్న లైటింగ్‌ కారణంగా బంతిని చూడలేకపోయాడా.. అనేది తెలియదు. కానీ, ఒకవేళ బంతిని చూసివుంటే వెంటనే అతడు ముందుకు కదిలివుండాలి కదా? ఈ ప్రశ్నకు సమాధానం అతడు మాత్రమే చెప్పగలడు. మొత్తానికి ఫీల్డింగ్‌ పరంగా మెప్పించలేకపోయారు. ఈ మ్యాచ్‌ అంత గొప్పగా ఆడలేదు. అలాగని మరీ చెత్తగానూ ఆడలేదు. చివరి ఓవర్‌లో కొన్ని బౌండరీలను ఒత్తిడి కారణంగా వదిలేసి ఉండవచ్చు" అంటూ దినేశ్‌ తెలిపాడు.

ఈ మ్యాచ్‌లో ఫీల్డర్ల వైఫల్యం కెప్టెన్‌ రోహిత్‌ శర్మకు సైతం ఆగ్రహం తెప్పించింది. మ్యాచ్‌ అనంతరం ఓటమిపై కేఎల్‌ రాహుల్‌ మాట్లాడుతూ.. "ఇది క్రికెట్‌.. కొన్ని సార్లు మనం ఊహించనివి జరుగుతుంటాయి. చివరి వరకు జట్టు బాగా పోరాడింది. అయితే, కొన్ని మిస్సింగ్‌ క్యాచ్‌లు, మిరాజ్‌ ఇన్నింగ్స్‌ వంటివి దెబ్బతీశాయి" అంటూ తెలిపాడు. కాగా, రెండో వన్డే.. డిసెంబర్‌ 7న జరగనుంది.

ఇదీ చూడండి: Fifa Worldcup: కళ్లు చెదిరేలా మ్యాజిక్ గోల్​.. బురిడీ కొట్టించడం అతడి స్పెషాలిటీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.