ఆసియాకప్-2022 విజేతగా శ్రీలంక నిలిచింది. ఆదివారం దుబాయ్ వేదికగా జరిగిన ఫైనల్లో పాకిస్థాన్‌ను 23 పరుగుల తేడాతో ఓడించి ఛాంపియన్‌గా శ్రీలంక అవతరిచింది. అయితే ఈ మ్యాచ్‌లో శ్రీలంక యువ పేసర్ దిల్షాన్ మధుశంకా చెత్త రికార్డు నమోదు చేశాడు. ఒక్క లీగల్ డెలివరీ వేయకుండానే 9 పరుగులు సమర్పించుకున్నాడు. అంతర్జాతీయ టీ20ల్లో ఇన్నింగ్స్ ప్రారంభంలోనే ఇంత పేలవమైన బౌలింగ్ చేసిన తొలి బౌలర్‌గా మధుశంకా చెత్త రికార్డును నమోదు చేశాడు.
తొలి బంతిని ఫ్రంట్ ఫుట్ నోబాల్‌గా వేసిన మధుశంకా.. ఫ్రీ హిట్‌ను సమర్థవంతంగా అడ్డుకోవాలనే ఉద్దేశంతో బౌన్సర్ సంధించాడు. కానీ అది బ్యాటర్ తలపై నుంచి దూసుకెళ్లడంతో అంపైర్ వైడ్ ఇచ్చాడు. ఆ తర్వాత లెగ్ స్టంప్ టార్గెట్‌గా వరుసగా మూడు వైడ్స్ వేశాడు. ఇందులో ఒకటి వికెట్ కీపర్‌ను మిస్సై బౌండరీకి వెళ్లింది. దాంతో తొలి ఐదు బంతుల్లో ఒక్క లీగల్ డెలివరీ పడకుండానే ఎక్స్‌ట్రాస్ రూపంలో పాక్ ఖాతాలో 9 పరుగులు చేరాయి.
అనంతర ఆరో బంతిని మధుశంకా సరిగ్గా వేశాడు. ఈ ఫ్రీహిట్ బంతికి పాక్‌బ్యాటర్ రిజ్వాన్ సింగిల్ మాత్రమే సాధించాడు. దీంతో తొలి బంతి పడేటప్పటికి పాక్ ఖాతాలో 10 పరుగులు వచ్చి చేరాయి.
అనంతరం మూడు బంతులను కట్టుదిట్టంగా బౌలింగ్ చేసిన మధుశంకా మొత్తంగా 12 పరుగులు మాత్రమే ఇచ్చాడు. మొత్తంగా మధుశంకా ఇలా వరుసగా వైడ్లు వేయడం చర్చనీయాంశమైంది. మంచి మూమెంట్‌మ్‌తో మ్యాచ్ ప్రారంభించిన శ్రీలంకకు బౌలింగ్‌లో పేలవ ఆరంభాన్ని అందించాడని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నువ్వేం బౌలర్ అయ్యా అంటూ కామెంట్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
-
0 ball 9 Runs 😂
— Mehu 💕🦋 (@mahakhan199) September 11, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
It's a Record , thanks Srilanka #PAKvsSL#AsiaCup2022Final pic.twitter.com/ONoxeIiLxr
">0 ball 9 Runs 😂
— Mehu 💕🦋 (@mahakhan199) September 11, 2022
It's a Record , thanks Srilanka #PAKvsSL#AsiaCup2022Final pic.twitter.com/ONoxeIiLxr0 ball 9 Runs 😂
— Mehu 💕🦋 (@mahakhan199) September 11, 2022
It's a Record , thanks Srilanka #PAKvsSL#AsiaCup2022Final pic.twitter.com/ONoxeIiLxr
కాగా, 171 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్థాన్ 147 పరుగులకే కుప్పకూలింది. పాక్ బ్యాటర్లలో మహ్మద్ రిజ్వాన్(55) మినహా మిగితా అందరూ దారుణంగా విఫలమయ్యారు. లంక బౌలర్లలో ప్రమోద్ మదుషన్ 4 వికెట్లతో పాక్‌ను దెబ్బ తీయగా.. హాసరంగా మూడు, కరుణరత్నే రెండు వికెట్లు సాధించారు. అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 170 పరుగులు చేసింది. బానుక రాజపక్స 45 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లతో 71 పరుగులు చేసి విధ్వంసం సృష్టించాడు. అతడితో పాటు వనిందు హసరంగా 21 బంతుల్లో 36 పరుగులతో రాణించాడు. పాకిస్థాన్ బౌలర్లలో హారిస్ రౌఫ్ 3, నసీమ్ షా, షాదాబ్ ఖాన్, ఇఫ్తికర్ అహ్మద్‌లు తలా ఒక వికెట్ తీశారు.
ఇదీ చూడండి: క్రికెటర్లకు దాదా సూచన.. దానికి దూరంగా ఉండాలంటూ..