Dhoni new look IPL 2022: ఎప్పటికప్పుడూ సరికొత్త లుక్‌లో దర్శనమిస్తూ అభిమానులను ఆశ్చర్యపరుస్తుంటాడు టీమ్ఇండియా మాజీ కెప్టెన్, సీఎస్కే సారథి ధోనీ. అయితే ఈ సారి గుర్తుపట్టలేనంతగా మారిపోయాడు! అతడి కొత్త గెటప్ చూసి ఫ్యాన్స్‌లో మరింత ఉత్సాహం పెరిగింది. ఐపీఎలో 2022 ప్రమోషన్లో భాగంగా మహీ ఓ వీడియోలో నటించాడు. అందులోనే కొత్త లుక్‌లో దర్శనమిచ్చాడు. ఈ మెగాటోర్నీని ప్రసారం చేసే స్టార్‌స్పోర్ట్స్ బ్రాడ్‌కాస్టింగ్ ఈ ప్రమోషన్‌ను రూపొందించింది
ఖాకీ చొక్కా, ప్యాంటు వేసుకుని.. కూలింగ్ గ్లాస్ పెట్టుకుని.. పెద్ద మీసం.. మెడలో కర్చీఫ్.. చేతిలో మైక్ పట్టుకుని.. ధోనీ అదరగొట్టాడు. ఆటకు వేళాయే అన్నట్లుగా లుక్ ఉంది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారింది.
కాగా, ఐపీఎల్లో సీఎస్కేను ఇప్పటివరకు నాలుగుసార్లు ఛాంపియన్‌గా నిలబెట్టాడు ధోనీ. ఈ సీజన్ మార్చి 26 నుంచి మే 29 వరకు జరగనుంది. మొత్తం 10 జట్లు 72 మ్యాచ్‌లు ఆడనున్నాయి.
ఇదీ చూడండి: IND VS SL: వారికి ఒక్క అవకాశం చాలు: రోహిత్ శర్మ