ETV Bharat / sports

కోహ్లీ హెల్మెట్​పై ఉన్న జాతీయ జెండా చిహ్నం.. ధోనీకి ఎందుకు లేదో తెలుసా? - ధోనీ హెల్మెట్​పై జాతీయ జెండా ఎందుకు ఉండదు

Dhoni helmet indian flag : టీమ్​ఇండియా క్రికెట్ ప్లేయర్లకు.. వారి హెల్మెట్​పై జాతీయ జెండా చిహ్నం కనపడుతుంది. కానీ మహీ జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న సమయంలో అతడి హెల్మెట్​పై మాత్రం ఉండదు. మిగతా ఆటగాళ్లకు ఉంటుంది. ఎందుకో తెలుసా?

Dhoni
ధోనీ హెల్మెట్​పై జాతీయ జెండా చిహ్నం ఎందుకు లేదు
author img

By

Published : Jul 9, 2023, 10:27 AM IST

Updated : Jul 9, 2023, 11:39 AM IST

Dhoni helmet indian flag : క్రికెట్​.. ఈ ఆటకు భారత దేశంలో ఎంతో క్రేజ్ ఉంది. ఓ మతంలా భావిస్తారు. కొంతమంది అభిమానులైతే.. తమ అభిమాన క్రికెటర్లను ఏకంగా దైవంగా భావిస్తారు. అలానే టీమ్​ఇండియాలో స్టార్ ప్లేయర్లకు కొదవే లేదు. తమ ఆటతీరుతో. అలాగే తమ వ్యక్తిత్వంతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నారు.

సచిన్ తెందుల్కర్​, మహేంద్రసింగ్‌ ధోనీ, విరాట్‌ కోహ్లీ, రోహిత్‌ శర్మ.. ఇలా ఎంతో మంది ఈ జాబితాలోని వారే. వీరిలో కోహ్లీ, రోహిత్‌ ప్రస్తుతం టీమ్‌ఇండియాకు ప్రాతినిధ్యం వహిస్తుండగా.. సచిన్​, ధోనీ ఎప్పుడో అంతర్జాతీయ క్రికెట్​కు రిటైర్మెంట్ ప్రకటించేశారు. మహీ అయితే ఇంటర్నేషనల్​ క్రికెట్​కు గుడ్​బై చెప్పేసిన ఇంకా ఐపీఎల్​లో ఆడుతూ అభిమానులను అలరిస్తున్నారు.

ఇంకా చెప్పాలంటే మహీ భాయ్‌ గురించి ఎప్పుడు ఏదో ఒక వార్త సోషల్​మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉంటుంది. అభిమానులు దాన్ని ట్రెండ్ చేస్తూనే ఉంటారు. ఎందుకంటే అతడి గురించి ఎంత చెప్పినా తక్కువే. బ్యాటర్​గా, వికెట్ కీపర్​గా, కెప్టెన్​గా.. భారత జట్టుకు సేవలందించాడు. ముఖ్యంగా వికెట్​కీపర్​గా చెరగని ముద్ర వేశాడు. రెప్పపాటులో వికెట్లను గిరాటేసి.. మెరుపు రనౌట్‌లకు కేరాఫ్ అడ్రెస్​గా మారాడు.

dhoni wicket keeper : అయితే ధోనీ నేషనల్ టీమ్​కు ప్రాతినిధ్యం వహించిన సమయంలో.. అతడి హెల్మెట్​ను గమనిస్తే.. దానిపై జాతీయ జెండా చిహ్నం కనపడదు. కానీ టీమ్​లోని మిగిలిన ప్లేయర్స్​ హెల్మెట్‌పై త్రివర్ణ పతాక చిహ్నం మాత్రం ఉంటుంది. మరి సుదీర్ఘ కాలం పాటు భారత జట్టుకు కెప్టెన్​గా కొనసాగిన మహీ హెల్మెట్‌పై జాతీయ జెండా చిహ్నం ఎందుకు లేదంటే.. దానికీ ఓ బలమైన కారణం ఉంది.

వికెట్ల వెనక అతడు ఆడేటప్పుడు.. చాలా సార్లు మహీ హెల్మెట్‌ ధరించడు. తరుచూ దాన్ని నేలపై ఉంచుతుంటాడు. అలా పదే పదే హెల్మెట్​ను కింద పెట్టాల్సిన వస్తుండటం వల్ల.. జాతీయ జెండాను కింద పెట్టినట్టుగా మహీ భావించాడట. అది సరైన పద్ధతి కాదని భావించి.. దేశంమీద ఉన్న గౌరవంతో హెల్మెట్​పై జాతీయ జెండా చిహ్నాన్ని తీయించుకున్నాడట.

ఇకపోతే మహేంద్రుడు.. భారత ఆర్మీలో గౌరవ లెఫ్టినెంట్‌ హోదా దక్కించుకున్న సంగతి తెలిసిందే. అలాగే 2019 వన్డే ప్రపంచకప్‌ సమయంలోనూ పుల్వామా బాధితులకు నివాళులర్పించేందుకు ఆర్మీకి చెందిన చేతి గ్లౌజ్‌లను కూడా ధరించాడు.

ఇదీ చూడండి :

పెంపుడు కుక్కలతో మహీ బర్త్​డే సెలబ్రేషన్స్​.. అందరినీ ఫిదా చేశాడుగా!

ధోనీ చెప్పిన కెప్టెన్సీ సీక్రెట్ ఇదే.. అంత కూల్​గా ఎలా ఉంటాడో తెలుసా?

Last Updated : Jul 9, 2023, 11:39 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.