Dhoni Birthday Video : టీమ్ఇండియా మాజీ సారథి, దిగ్గజ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీ జూలై7న 42వ పడిలోకి అడుగుపెట్టాడు. దేశమే కాదు ప్రపంచంలోని ఫ్యాన్స్ అందరూ ధోనీ బర్త్‌డేను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేశారు. సోషల్ మీడియా వేదికగా తమ అభిమాన స్టార్‌కు విషెస్ చెబుతూ సందడి చేశారు. ఇక మిస్టర్ కూల్ కూడా తన బర్త్‌డే వేడుకలను సింపుల్‌గా చేసుకున్నాడు. తన ఫామ్ హౌన్లోనే జరిగిన బర్త్‌డేకు సంబంధించిన వీడియోను ధోనీ తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో షేర్ చేశాడు.
రాంచీలోని ఫామ్‍హౌస్‍లో తన పెంపుడు కుక్కలతో కలిసి ధోనీ పుట్టిన రోజు వేడుకను జరుపుకున్నాడు. తన నాలుగు పెంపుడు శునకాల సమక్షంలో ఓ చిన్ని కేక్ పైనున్న క్యాండిల్ ఊడిన మాహీ.. ఆ తర్వాత దాన్ని కట్ చేసి వాటికి తినిపించాడు. ఆ తర్వాత తాను కూడా ఓ కేక్ ముక్క తిన్నాడు. "నాకు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పిన అందరికీ చాలా థ్యాంక్స్. ఈ బర్త్‌డే రోజు నేను ఏం చేశానో ఓ చిన్న గ్లింప్స" అంటూ ఓ క్యాప్షన్‌ను జోడించాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడయాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది.
ధోనీ చేసిన ఈ పనికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఈ వీడియోతో అందరికీ స్పూర్తిదాయకంగా నిలిచాడని.. ఇది తమ హృదయాలను హత్తుకుంటోందంటూ అభిమానులు మిస్టర్ కూల్‌పై ప్రశంసల జల్లును కురిపిస్తున్నారు. తన సింప్లిసిటీ, పెంపుడు జంతువుల మీద ఉన్న ప్రేమను చూసి మురిసిపోతున్నారు. ఇక ఈ వీడియో ఇన్‍స్టాగ్రామ్‍లో పోస్ట్ చేసిన గంటలోనే సుమారు 2.4 మిలియన్ల లైక్స్‌ను అందుకుని రికార్డుకెక్కింది.
ఇక ధోనీ క్రికెట్ జర్నీని చూస్తే.. తన కెప్టెన్సీలో టీమ్ఇండియాకు ఎన్నో కప్పులను తెచ్చిపెట్టాడు. 2007లో జరిగిన టీ20 ప్రపంచకప్, 2011 వన్డే ప్రపంచకప్, 2013 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ గెలుపులో కీలక పాత్ర పోషించాడు. ఇక 2020లో ధోనీ అంతర్జాతీయ క్రికెట్‍కు రిటైర్మెంట్ పలికాడు. ప్రస్తుతం ఐపీఎల్‍లో కొనసాగుతున్నాడు. ఈ ఏడాది ఐపీఎల్‍లో చెన్నై సూపర్ కింగ్స్‌కు సారధిగా ఉన్న ధోనీ.. తన టీమ్‌కు ఐదోసారి ఐపీఎల్ టైటిల్‍ను అందించాడు.