ETV Bharat / sports

ధోనీ గ్యారేజీలో కార్లు, బైక్లు ఎన్ని ఉన్నాయంటే? - dhoni kohli news

ఎంఎస్​ ధోనీ పేరు వినగానే ఓ వైపు క్రికెట్.. మరోవైపు కార్లు, బైక్​లు మదిలో మెదులుతాయి. మాహీకి ఆటతో పాటు, వాహనాల సేకరణ అంటే ఇష్టం. మార్కెట్​లో మహీకి నచ్చిన ప్రతి కారు, బైక్ అతడి గ్యారేజీలో కనిపిస్తాయి. ఇప్పటివరకు ఈ మాజీ క్రికెటర్​ దగ్గర ఉన్న వాహనాలపై ఓ లుక్కేద్దామా?​

dhoni bike car collection
ధోనీ బైక్ కార్ కలెక్షన్
author img

By

Published : Jan 3, 2022, 9:31 AM IST

టీమ్​ఇండియా మాజీ కెప్టెన్​ మహేంద్ర సింగ్​ ధోనీ ఆటకు ఎంతో మంది క్రికెట్ అభిమానులున్నారు. మైదానంలో మహీ హెలికాప్టర్​ షాట్లు కొడితే ప్రేక్షకులు ఆనందంతో గెంతులు వేస్తారు. ఇంతటి అభిమానాన్ని సొంతం చేసుకున్న ధోనీకి కార్లు, బైక్​లంటే ఎంతో ఇష్టం. కొత్తగా మార్కెట్​లోకి వచ్చిన వాహనాల్లో తనకు నచ్చిన వాటిని సేకరిస్తూ ఉండటం మాహీకి సరదా.

టీమ్​ఇండియా దాదాపు 14 ఏళ్లపాటు ప్రాతినిధ్యం వహించిన ధోనీ ఇంట్లో చాలా లగ్జరీ కార్లు దర్శనమిస్తాయి. ఫెరారీ 599 జీటీఓ, యమహా ఆర్డీ 350 ఇలా తదితర వాహనాలు ఇందులో ఉన్నాయి. ఆసక్తికరమైన విషయం ఏంటంటే, వీటిని కొనడమే కాదు, వాటి యంత్ర భాగాల అమరిక గురించీ ధోనీకి క్షుణ్నంగా తెలుసు .

dhoni bike
బైక్​​తో ధోనీ

10కిపైగా కార్లు..

లగ్జరీ కార్లపై ధోనీకి ఉన్న ప్రేమ అతని అభిమానులకు సుపరిచితమే. ఇప్పటి వరకు సుమారు 10కార్లకు పైగా సేకరించాడు. వీటిలో ఫెరారీ 599 జీటీఓ, హమ్మర్​ హెచ్​2, జీఎంసీ సియెర్రా సహా పలు అత్యాధునిక కార్లకు మాహీ యాజమాని. 2019లో ధోనీ గ్యారేజీలో చేరిన జోంగా అనే వాహనాన్ని భారత సైన్యంలో ఉపయోగిస్తారు.

dhoni bike
బైక్​ల​తో ధోనీ

బైక్​లంటే అమితమైన ప్రేమ...

టీమ్​ఇండియా మాజీ కెప్టెన్​కు కార్లే కాదు, బైక్​లన్నా యమ మోజు. వీటిలో ధోనీకి ఎంతో ఇష్టమైన బైక్​ రాజ్​దూత్​ ఆర్డీ 350. ఇప్పటివరకు తన సేకరణలో ఈ రకమైన బైక్​లను ఒకటి కంటే ఎక్కువే కొన్నాడు. కాన్ఫెడరేట్​ హెల్కాట్​ ఎక్స్​ 32, హార్లే డేవిడ్​సన్​ ఫాట్​బాయ్​, బీఎస్​ఏ గోల్డ్​ స్టార్​, కవాసకి నింజా జెడ్​ఎక్స్​ 14 ఆర్​, యమహా ఎఫ్​జెడ్​1, డుకాటీ 1098, తాజాగా కవాసకి నింజా హెచ్​ 2 వంటి అద్భుతమైన బైక్​ మోడళ్లు ధోనీ సొంతం.

dhoni bike
బైక్​ల​తో ధోనీ

2020లో రిటైర్మెంట్​ ప్రకటించిన ధోనీ.. ప్రస్తుతం ఐపీఎల్​ మాత్రమే ఆడుతున్నాడు. చెన్నై సూపర్​కింగ్స్​ కెప్టెన్​గా ఉన్న అతడు.. గతేడాది తన జట్టును నాలుగోసారి విజేతగా నిలిపాడు. ఈ ఏడాది ఏప్రిల్​లో మొదలయ్యే కొత్త సీజన్​ కోసం సిద్ధమవుతున్నాడు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.