Devon Conway Record: న్యూజిలాండ్ బ్యాటర్ డేవిడ్ కాన్వే టెస్టు క్రికెట్లో అరుదైన రికార్డు నెలకొల్పాడు. బంగ్లాదేశ్‌తో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో అర్ధసెంచరీ చేయడం ద్వారా.. ఈ ఫార్మాట్లో తొలి ఐదు టెస్టుల్లోని మొదటి ఇన్నింగ్స్ అన్నింటిలోనూ హాఫ్ సెంచరీలు బాదిన తొలి క్రికెటర్‌గా ఘనత వహించాడు.
గతేడాది జూన్‌లో లార్డ్స్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్టు ద్వారా సుదీర్ఘ ఫార్మాట్లో అరంగేట్రం చేశాడు కాన్వే. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో అద్భుత డబుల్ సెంచరీ (200)తో సత్తాచాటాడు. తర్వాత ఎడ్జ్‌బాస్టన్ టెస్టులోనూ 80 పరుగులతో రాణించాడు. అలాగే టీమ్ఇండియాతో జరిగిన డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్‌లో 84 పరుగులతో ఆకట్టుకున్నాడు. అనంతరం బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో అద్భుత సెంచరీ (122)తో మెరిశాడు. ఆదివారం ప్రారంభమైన రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో మొదటి రోజు ఆటముగిసే సమయానికి 99 పరుగులతో క్రీజులో ఉన్నాడు.
ఆరంభం అదిరింది
ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కివీస్‌కు ఓపెనర్లు విల్ యంగ్, టామ్ లాథమ్ శుభారంభాన్ని ఇచ్చారు. తొలి వికెట్‌కు వీరిద్దరూ 148 పరుగులు జోడించారు. 54 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద యంగ్ ఔటయ్యాడు. అనంతరం లాథమ్‌కు మద్దతుగా నిలిచాడు కాన్వే. బంగ్లా బౌలర్లపై విరుచుపడుతూ వీరిద్దరూ స్కోర్‌బోర్డును పరుగులు పెట్టించారు. దీంతో తొలి రోజు ఆట ముగిసే సమయానికి కివీస్ వికెట్ నష్టానికి 349 పరుగులు చేసింది. లాథమ్ (186*), కాన్వే (99*) క్రీజులో ఉన్నారు.