ETV Bharat / sports

కోహ్లీతో బ్యాటింగ్ చాలా ఈజీ: దేవ్​దత్ పడిక్కల్ - kohli rcb

Devdutt padikkal kohli ipl: కోహ్లీతో బ్యాటింగ్ చేస్తే, తనపై బౌలర్లు పెద్దగా దృష్టిపెట్టరని అన్నాడు యువ బ్యాటర్​ దేవ్​దత్ పడిక్కల్. అతడితో ఆడటం అదృష్టంగా భావిస్తున్నానని చెప్పాడు.

kohli rcb
కోహ్లీ దేవ్​దత్ పడిక్కల్
author img

By

Published : Feb 9, 2022, 7:23 AM IST

IPL 2022: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్​లో(ఐపీఎల్‌) రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్సీబీ) తరఫున ఆడుతున్న యువ ఆటగాడు దేవ్‌దత్ పడిక్కల్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. విరాట్‌ కోహ్లీతో బరిలోకి దిగితే.. బౌలర్లు తనపై పెద్దగా దృష్టి పెట్టరని పేర్కొన్నాడు. తద్వారా తాను స్వేచ్ఛగా బ్యాటింగ్‌ చేసేవాడినని చెప్పాడు.

'నా వరకైతే విరాట్‌ కోహ్లీతో కలిసి బ్యాటింగ్‌ చేయడం చాలా సులభం. ఎందుకంటే బౌలర్ల దృష్టంతా కోహ్లీపైనే ఉంటుంది. బంతులు ఎక్కడ వేయాలి? అతడిని ఎలా ఔట్ చేయాలనే దాని గురించే ఆలోచిస్తారు. బౌలర్లు వారి ప్రణాళికలన్నింటినీ కోహ్లీపైనే ప్రయోగిస్తారు. నన్నెవరూ పట్టించుకోరు. దాంతో నేను భయం లేకుండా ఆడేవాడిని. కోహ్లీ లాంటి దిగ్గజ ఆటగాడితో ఆడటం నా అదృష్టంగా భావిస్తాను' అని దేవ్‌దత్‌ పడిక్కల్‌ పేర్కొన్నాడు.

గత ఐపీఎల్ సీజన్​లో దేవ్‌దత్.. 14 మ్యాచుల్లో 411 పరుగులు చేశాడు. రాజస్థాన్‌ రాయల్స్‌ జట్టుపై శతకం కూడా నమోదు చేశాడు. మరోవైపు కోహ్లీ గత సీజన్‌లో 15 మ్యాచులు ఆడి 405 పరుగులు చేశాడు. వచ్చే సీజన్‌ కోసం బెంగళూరు యాజమాన్యం విరాట్‌ కోహ్లీ, మహమ్మద్‌ సిరాజ్‌, గ్లెన్‌ మాక్స్‌వెల్‌లను రిటెయిన్ చేసుకుంది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.