ETV Bharat / sports

దిల్లీపై రాజస్థాన్​ విజయం

author img

By

Published : Apr 15, 2021, 11:24 PM IST

Updated : Apr 15, 2021, 11:36 PM IST

గురువారం జరిగిన మ్యాచ్​లో దిల్లీ క్యాపిటల్స్​పై రాజస్థాన్​ రాయల్స్​ 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంలో డేవిడ్​ మిల్లర్​(62) కీలక పాత్ర పోషించాడు.

Rajasthan royals
రాజస్థాన్​ రాయల్స్​

వాంఖడే వేదికగా జరిగిన మ్యాచ్​లో దిల్లీ క్యాపిటల్స్​పై రాజస్థాన్​ రాయల్స్​ విజయం సాధించింది. 3 వికెట్ల తేడాతో గెలుపొంది ఈ సీజన్​లో తొలి విజయం నమోదు చేసింది. విజయంలో డేవిడ్​ మిల్లర్​ (62), క్రిస్​ మోరిస్(36)​ కీలక పాత్ర పోషించారు.

148 పరుగుల ఛేదన ప్రారంభించిన రాజస్థాన్​కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. 3వ ఓవర్లో క్రిస్​ వోక్స్​ బౌలింగ్​లో​ వరుసగా మనన్​ వోహ్రా(9), జాస్​ బట్లర్​(2) రెండు వికెట్లను కోల్పోయింది. అనంతరం క్రీజులోకి వచ్చిన సంజు శాంసన్​(4) కూడా 3.3 ఓవర్​ 17 పరుగుల వద్ద వెనుదిరిగాడు. రబాడా బౌలింగ్​లో ధావన్​కు క్యాచ్​ ఇచ్చి ఔట్​ అయ్యాడు. ఆ తర్వాత శివమ్​ దూబె(2), రియాన్​ పరాగ్​(2) కూడా వెంట వెంటనే పెవిలియన్​ చేరారు. ఆరో వికెట్​గా రాహల్ తెవాతియా(19) వెనుదిరిగాడు. డేవిడ్​ మిల్లర్(62) ధనాధన్​ బ్యాటింగ్​తో ఇన్నింగ్స్​ను చక్కదిద్దాడు.

దిల్లీ బౌలర్లలో అవేష్​ ఖాన్​ 3 క్రిస్​ వోక్స్​, కగిసో రబాడా తలో 2 వికెట్లు తీశారు.

తొలుత టాస్ ఓడి బ్యాటింగ్​కు దిగిన దిల్లీకి ప్రారంభంలో ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్లు పృథ్వీషా(2), ధావన్​(9) సహా రహానె(8), స్టోయినిస్(0) స్వల్ప స్కోర్లకే వెనుదిరిగారు. అనంతరం కెప్టెన్ పంత్​(51) కొత్త కుర్రాడు లలిత్ యాదవ్​తో(20) కలిసి స్కోరును మెల్లగా పెంచాడు. ఈ క్రమంలోనే అర్ధశతకం చేసిన తర్వాత రనౌట్ అయ్యాడు.

మిగతా బ్యాట్స్​మెన్​లో టామ్ కరన్(21), వోక్స్(15), అశ్విన్(7).. ఎక్కువ పరుగులు చేయలేకపోయారు. రాజస్థాన్ బౌలర్లలో ఉనద్కత్ 3, ముస్తాఫిజుర్ 2, మోరిస్ ఓ వికెట్ పడగొట్టారు.

Last Updated : Apr 15, 2021, 11:36 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.