ETV Bharat / sports

దీపక్​ చాహర్​కు చేదు అనుభవం.. ఆ ఎయిర్ ​లైన్స్​పై ఆగ్రహం!​ - దీపక్​ చాహర్ మలేషియా ఎయిర్​లైన్స్​ వార్​

భారత్​-బంగ్లాదేశ్​ ఆదివారం ఢాకా వేదికగా జరగనున్న తొలి వన్డే‌ ఆడనుంది. అయితే ఈ సిరీస్​ కోసం అక్కడికి చేరుకున్న టీమ్​ఇండియా క్రికెటర్​ దీపక్ చాహర్​కు చేదు అనుభవం ఎదురైంది. ఇంతకీ ఏమైందంటే..?

deepak
దీపక్​ చాహర్
author img

By

Published : Dec 3, 2022, 1:53 PM IST

వన్డే సిరీస్‌ కోసం బంగ్లాదేశ్‌ చేరుకున్న టీమ్​ఇండియా పేసర్‌ దీపక్‌ చాహర్‌కు చేదు అనుభవం ఎదురైంది. ఈ సిరీస్​ కోసం అతడు మలేషియా ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానంలో అక్కడికి చేరుకున్నాడు. కానీ సదరు ఎయిర్‌లైన్స్ సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల అసహనానికి గురైన అతడు​ ఆగ్రహానికి గురయ్యాడు.

ఇదీ జరిగింది.. న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌లో భాగంగా ఉన్న దీపక్‌ చాహర్‌, శిఖర్‌ ధావన్‌, వాషింగ్టన్‌ సుందర్‌, శ్రేయస్‌ అయ్యర్‌ నేరుగా వెల్లంగ్టన్‌ నుంచి మలేషియా ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానంలో ఢాకాకు చేరుకున్నారు. కానీ మలేషియా ఎయిర్‌లైన్స్ సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా దీపక్ చాహర్ లగేజి మాత్రం ఢాకాకు రాలేదు. ఈ క్రమంలో అసహనానికి గురైన చాహర్ మలేషియా ఎయిర్‌లైన్స్‌పై తీవ్ర స్థాయిలో మండిపడ్డాడు. నేను ఇప్పటి వరకు ఇంత చెత్త సర్వీస్‌ను చూడలేదంటూ ట్విటర్‌ వేదికగా ఆగ్రహాం వ్యక్తం చేశాడు.

కనీసం ఫుడ్‌ కూడా లేదు.. "మలేషియా ఎయిర్‌లైన్స్‌లో దారుణమైన అనుభవం ఎదురైంది. తొలుత మాకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా మా ఫ్లైట్ మార్చారు. మేము బిజినెస్ క్లాస్‌లో ప్రయాణించినప్పటికీ.. ఎటువంటి ఆహారం కూడా అందజేయలేదు. మాతో పాటు లగేజ్‌ కూడా రాలేదు. గత 24 గంటల నుంచి లగేజ్‌ కోసం మేము ఎదురుచూస్తున్నాము. ఇప్పటి వరకు నా లగేజీ రాకపోతే.. రేపు మ్యాచ్‌కు ఏ విధంగా సన్నద్దం అవుతాను" అని చాహర్‌ ట్విటర్‌లో పేర్కొన్నాడు.

కాగా చాహర్‌తో పాటు మరి కొంత మంది ప్రయాణికుల లగేజి కూడా రాలేదు. ఇక దీపక్ చాహర్ ట్వీట్‌‌పై మలేషియా ఎయిర్‌లైన్స్ నిమిషాల వ్యవధిలోనే స్పందించింది. చాహర్‌కు కలిగిన అసౌకర్యానికి క్షమాపణలు తెలిపింది. ఇకపోతే భారత్‌- బంగ్లాదేశ్‌ మధ్య తొలి వన్డే ఆదివారం(డిసెంబర్‌ 4)న ఢాకా వేదికగా జరగనుంది.

ఇవీ చదవండి: కామెంటరీ చేస్తుండగా రికీ పాంటింగ్​కు గుండెపోటు​.. ఆస్పత్రికి తరలింపు!

బెల్జియం ఔట్‌.. అవకాశాలు వచ్చినా.. గెలిచినా ఇంటికే..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.