ETV Bharat / sports

దీపక్​ చాహర్​ గాయం తీవ్రం.. టీ20 వరల్డ్​ కప్​ కూడానా? - దీపక్​ చాహర్​ ఐపీఎల్​

Deepak Chahar IPL 2022: వెన్నునొప్పి కారణంగా ఇప్పటికే ఐపీఎల్​ 15వ సీజన్​ మొత్తానికి దూరమయ్యాడు చెన్నై సూపర్​ కింగ్స్​ ప్రధాన బౌలర్​ దీపక్​ చాహర్​. తాజా సమాచారం ప్రకారం గాయం తీవ్రమవటం వల్ల మరో నాలుగు నెలల పాటు ఆటకు దూరం కానున్నాడని తెలుస్తోంది. అదే జరిగితే ఈ ఏడాది జరగనున్న టీ20 వరల్డ్​ కప్​కు సైతం చాహర్​ దూరమవుతాడనే వాదనలు వినిపిస్తున్నాయి.

Deepak Chahar
దీపక్​ చాహర్​
author img

By

Published : Apr 14, 2022, 10:02 AM IST

Deepak Chahar IPL 2022: టీమిండియా పేసర్​, చెన్నై సూపర్​ కింగ్స్​ ప్రధాన బౌలర్​ దీపక్ చాహర్​ మరో నాలుగు నెలల పాటు ఆటకు దూరం కానున్నాడు. తొడ కండరాల గాయం నుంచి కోలుకున్న అతను బెంగళూరులోని జాతీయ క్రికెట్​ అకాడమీలో నెట్​ ప్రాక్టీస్​ చేస్తూ గాయపడ్డాడు. వెన్నునొప్పి ఎక్కువగా ఉన్నందున మరో నాలుగు నెలల పాటు రెస్ట్​ తీసుకోవాలని వైద్యులు సూచించినట్లు తెలుస్తోంది.

ఇప్పటికే గాయం కారణంగా ఐపీఎల్​ 2022 సీజన్​ మొత్తానికి దురమయ్యాడు చాహర్​. ఇప్పుడు ఈ ఏడాది జరిగే టీ20 ప్రపంచ కప్​ 2022లోనూ అతడు ఆడటంపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఆస్ట్రేలియాలో ఈ ఏడాది అక్టోబర్​-నవంబర్​ మధ్యలో ఈ లీగ్​ జరగనుంది. నేషనల్​ మీడియా కథనాల ప్రకారం.. తాజాగా తీసిన స్కాన్స్​లో స్క్రాచెస్​ ఉన్నాయని, మరో నాలుగు నెలల పాటు మైదానంలోకి అడుగుపెట్టకూడదని వైద్యులు సూచించినట్లు తెలుస్తోంది. దీని ప్రకారం 2022 టీ20 వరల్డ్​ కప్​కు చాహర్​ దూరమయ్యే అవకాశాలే మెండుగా ఉన్నాయి.

తొడ కండరాల గాయం నుంచి కోలుకుని ఏప్రిల్​ రెండో వారంలో జట్టులో చేరతాడని చెన్నై సూపర్​ కింగ్స్​ భావించింది. అయితే.. అతడు నెట్స్​లో ప్రాక్టీస్​ చేస్తుండగా వెన్నునొప్పికి గురయ్యాడు. దీంతో ఐపీఎల్​ సీజన్​ మొత్తానికి దూరమయ్యాడు. ఈ ఏడాది మెగా వేలంలో రూ.14 కోట్లు పెట్టి కొనుగోలు చేసిన ప్రధాన బౌలర్​ సీజన్​కు దూరమవటం సీఎస్కేకు తీరని లోటు. చాహర్​ లేకుండానే బరిలోకి దిగిన చెన్నై.. వరుసగా నాలుగు మ్యాచ్​లు ఓడిపోయింది. ఫిబ్రవరిలో వెస్టిండీస్​తో మూడో టీ20 సందర్భంగా చాహర్ గాయపడ్డాడు. ఆ తర్వాత జరిగిన శ్రీలంక పర్యటనకూ దూరమయ్యాడు. భారీ షాట్లూ ఆడగల ఈ బౌలింగ్​ ఆల్​రౌండర్​.. గతేడాది సీఎస్​కే నాలుగోసారి టైటిల్ దక్కించుకోవడంలో కీలకపాత్ర పోషించాడు.

ఇదీ చూడండి: చెన్నైకి కోలుకోలేని దెబ్బ.. ఐపీఎల్​ నుంచి అతడు ఔట్!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.