సన్రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ మరోసారి నెట్టింట సందడి చేస్తున్నాడు. హైదరాబాద్ టీంకు సారథ్యాన్ని వహించి ఎన్నో విజయాలు అందించిన ఈ బ్యాట్స్మెన్.. తెలుగింటిపై తన మక్కువను చాటుకున్నాడు. 'నా రెండో ఇల్లు, భారతదేశంలో నాకు నచ్చే ప్రదేశం హైదరాబాద్' అంటూ ఇన్స్టాలో పోస్టు చేశాడు.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
ఇప్పటికే తెలుగువారికి ఎంతో దగ్గరైన ఈ ఆసీస్ క్రికెటర్.. కాస్త సమయం దొరికినా సామాజిక మాధ్యమాల్లో అభిమానులను అలరిస్తుంటాడు. తెలుగు హీరో అల్లు అర్జున్ నటించిన 'రాములో రాములా' పాటకు డ్యాన్సులు చేసిన వీడియోను తన ఇన్స్టాలో ఇటీవల పోస్టు చేసి తెలుగు సినీ, క్రికెట్ అభిమానులకూ ఎంతో దగ్గరయ్యాడు. సల్మాన్ ఖాన్ 'సుల్తాన్', చిరంజీవి 'సైరా', రజనీ 'రోబో 2' సినిమాల వీడియోలను ఎడిట్ చేసి తన ఇన్స్టా ఖాతాలో పోస్ట్ చేశాడు. రామ్ 'ఇస్మార్ట్ శంకర్', తారక్ 'అరవింద సమేత' చిత్రాల వీడియోలనూ పోస్ట్ చేసి అలరించాడు.
ఇదీ చదవండి:
వార్నర్ బాబాయ్ మళ్లీ మొదలెట్టాడు!
'రౌడీ బేబీ' పాటతో.. వార్నర్ ఈజ్ బ్యాక్