ETV Bharat / sports

కోహ్లీ​పై వార్నర్​ కంప్లైంట్.. ఏమన్నాడంటే? - డేవిడ్ వార్నర్ న్యూస్

David Warner Virat Kohli: టీమ్​ఇండియా టెస్టు సారథి విరాట్ కోహ్లీ ఇన్​స్టా వేదికగా ఓ వీడియో పోస్ట్​ చేశాడు. ఓ యాడ్​లో భాగంగా విరాట్​ డ్యాన్స్ చేస్తూ కనిపించిన ఈ పోస్ట్​పై ఆస్ట్రేలియా ఓపెనర్​ డేవిడ్ వార్నర్ స్పందించాడు.

warner, virat kohli
విరాట్ కోహ్లీ, వార్నర్
author img

By

Published : Dec 17, 2021, 11:55 AM IST

David Warner Virat Kohli: ఆస్ట్రేలియా ఓపెనర్​ డేవిడ్ వార్నర్ సోషల్​ మీడియాలో యాక్టివ్​గా ఉంటాడు. టాలీవుడ్​ పాటలను మిమిక్​ చేసి, కొన్ని పాటలకు డ్యాన్స్​ చేసి తెలుగు సినీ ప్రేమికులకు కూడా దగ్గరయ్యాడు. తాజాగా టీమ్​ఇండియా టెస్టు సారథి విరాట్​ కోహ్లీపై కంప్లైంట్ ఇచ్చాడు వార్నర్​. అసలేం జరిగిందంటే..

కాపీ చేశావ్​ అంటూ..

'డిజిట్​' పేరుతో ఉన్న ఇన్సూరెన్స్​ స్టార్టప్​ కోసం విరాట్​ యాడ్​ చేశాడు. ఇన్​స్టా వేదికగా దీన్ని పోస్ట్ చేశాడు. అయితే.. ఇందులో విరాట్​ డ్యాన్స్​ చేసిన తీరుపై వార్నర్​ సరదాగా కామెంట్​ చేశాడు. 'నా డ్యాన్స్​ మూవ్స్​ కాపీ చేశావ్' అని వార్నర్​ రిప్లై ఇచ్చాడు. దీనిపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు.

warner reply
వార్నర్ కామెంట్

ఇటీవలే వార్నర్​.. టాలీవుడ్​ సినిమా 'పుష్ప'లోని 'ఏయ్​ బిడ్డా.. ఇది నా అడ్డా' సాంగ్​ను మిమిక్ చేశాడు. దీనిపై విరాట్​ 'ఏమైంది మేట్?.. నువ్వు బాగానే ఉన్నావా?' అని కామెంట్​ చేశాడు. దీనికి వార్నర్​ కూడా సరదాగా రిప్లై ఇచ్చాడు. అయితే.. వార్నర్​ పోస్ట్ చేసిన వీడియో సోషల్​ మీడియాలో తెగ వైరల్​ అయింది.

కాగా, ఐపీఎల్​ 14 సీజన్​ అనంతరం రాయల్​ ఛాలెంజర్స్​ బెంగళూరు జట్టు సారథిగా తప్పుకుంటానని విరాట్​ ప్రకటించాడు. కారణం చెప్పకుండా కెప్టెన్సీ నుంచి తొలగించినందుకు డేవిడ్​ వార్నర్​.. సన్​రైజర్స్​ జట్టు తరఫున ఆడబోనని ఇటీవలే చెప్పేశాడు. ఈ నేపథ్యంలో ఇన్​స్టా వేదికగా విరాట్​- వార్నర్ పరస్పరం ఒకరి పోస్టులపై మరొకరు కామెంట్స్​ చేయడం​ చూస్తుంటే.. ఆర్సీబీ నెక్ట్స్ కెప్టెన్​ వార్నర్​ అయ్యే అవకాశాలనున్నాయని క్రికెట్ అభిమానులు కొందరు భావిస్తున్నారు. ​

ఇదీ చదవండి:

IPL 2021 news: 'వార్నర్​ను తప్పించడానికి కారణం అది​ కాదు'

ICC Player of the Month: ఐసీసీ 'ప్లేయర్ ఆఫ్​ ది మంత్' రేసులో వీరే!

'పుష్ప' సాంగ్​లో డేవిడ్ వార్నర్.. కోహ్లీ ఫన్నీ రిప్లై

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.