David Warner ODI Retirement: ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ డేవిడ్ వార్నర్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఇటీవల టెస్టులకు గుడ్‌బై చెప్పిన వార్నర్, తాజాగా వన్డే ఫార్మాట్‌కు కూడా రిటైర్మెంట్ ప్రకటించాడు. ఇకపై కేవలం టీ20ల్లోనే ఆడనున్నట్లు తెలిపాడు. అయితే 2025 ఛాంపియన్స్ ట్రోఫీలో జట్టుకు తన అవసరం ఉంటే కచ్చితంగా మళ్లీ ఆడతానని స్పష్టం చేశాడు. 'నేను వన్డే క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతున్నా. తాజాగా భారత్‌లో వరల్డ్‌కప్ గెలిచాం. అది అతి పెద్ద ఘనతగా భావిస్తాను. ఇక టెస్టు, వన్డేల్లో నుంచి తప్పుకోవాలనుకుంటున్నాను. టెస్టు, వన్డే క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించడం వల్ల, వరల్డ్‌వైడ్‌గా ఆయా డొమెస్టిక్ లీగ్‌ల్లో ఆడగలను. వచ్చే ఏడాది ఛాంపియన్స్ ట్రోఫీ ఉందని నాకు తెలుసు. అయితే ఈ రెండేళ్లు నేను నాణ్యమైన క్రికెట్ ఆడితే, జట్టు కావాలనుకున్నప్పుడు అందుబాటులోనే ఉంటా' అని అన్నాడు.
-
David Warner has announced his retirement from ODI cricket.
— Mufaddal Vohra (@mufaddal_vohra) January 1, 2024 " class="align-text-top noRightClick twitterSection" data="
One of the finest ever of the format, Thank you Davey...!!! 🫡 pic.twitter.com/6v6nRjwniN
">David Warner has announced his retirement from ODI cricket.
— Mufaddal Vohra (@mufaddal_vohra) January 1, 2024
One of the finest ever of the format, Thank you Davey...!!! 🫡 pic.twitter.com/6v6nRjwniNDavid Warner has announced his retirement from ODI cricket.
— Mufaddal Vohra (@mufaddal_vohra) January 1, 2024
One of the finest ever of the format, Thank you Davey...!!! 🫡 pic.twitter.com/6v6nRjwniN
Warner ODI World Cup 2023: ఆస్ట్రేలియా 2023 వన్డే వరల్డ్‌కప్ గెలవడంలో వార్నర్ కీలకపాత్ర పోషించాడు. 11 మ్యాచ్‌ల్లో వార్నర్ 48 సగటుతో 535 పరుగులు చేశాడు. అందులో రెండు సెంచరీలు, రెండు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఈ టోర్నీలో అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్ల లిస్ట్‌లో 6 స్థానంలో నిలిచాడు.
Warner ODI Stats: వార్నర్ 2009లో సౌతాఫ్రికాతో జరిగిన సిరీస్‌తో వన్డేల్లో అరంగేట్రం చేశాడు. సుదీర్ఘంగా 14 ఏళ్లపాటు ఆసీస్ తరపున ప్రాతినిధ్యం వహిస్తూ జట్టుకు అనేక విజయాలు కట్టబెట్టాడు. తన కెరీర్లో ఇప్పటివరకు 161 వన్డే మ్యాచ్‌లు ఆడాడు. 45.01 సగటుతో 6932 పరుగులు నమోదు చాశాడు. అందులో 22 సెంచరీలు, 33 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
Warner Test Retirement:మరోవైపు టెస్టు ఫార్మాట్‌కు ఇప్పటికే రిటైర్మెంట్ ప్రకటించిన వార్నర్, పాకిస్థాన్‌తో జరుగుతున్న సిరీస్‌లో ఆఖరి మ్యాచ్ ఆడనున్నాడు. సిడ్నీ వేదికగా పాకిస్థాన్- ఆస్ట్రేలియా మధ్య చివరి మ్యాచ్ జనవరి 3న ప్రారంభం కానుంది. ఇక మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను ఆతిథ్య జట్టు ఆస్ట్రేలియా ఇప్పటికే 2-0 తేడాతో గెలుచుకుంది.
మనసులు గెలుచుకున్న వార్నర్ - ఆ సమయంలోనూ ఫ్యాన్స్ కోసమే!
విరాట్ టు వార్నర్- ప్రపంచ కప్‌లో టాప్ -5 బ్యాటర్లు వీరే!