ETV Bharat / sports

'కోహ్లీ.. ఫామ్‌ సంగతి పక్కన పెట్టి మరో ఇద్దరు పిల్లలను కను' - విరపా

Virat Kohli Warner: గత కొంతకాలంగా ఫామ్ కోల్పోయి విమర్శలు ఎదుర్కొంటున్న భారత క్రికెట్​ జట్టు మాజీ సారథి విరాట్ కోహ్లీకి మాజీ క్రికెటర్లు ఎన్నో సలహాలు ఇస్తున్నారు. ఇక, తాజాగా దిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ కూడా సరదాగా ఓ సలహా ఇచ్చాడు.

kohli warner
kohli warner
author img

By

Published : May 4, 2022, 9:10 PM IST

Virat Kohli Warner: క్రికెట్‌లో ఎంతటి ఆటగాడైనా కొన్ని సమయాల్లో ఫామ్‌ కోల్పోవడం సహజం. ఆ ఫామ్‌ అందుకోవడానికి నానా తంటాలూ పడటమూ సహజమే. ప్రస్తుతం టీమ్​ఇండియా మాజీ సారథి విరాట్‌ కోహ్లీ కూడా అదే స్టేజ్‌లో ఉన్నాడు. అయితే విరాట్‌ మరికొద్ది రోజుల్లోనే ఫామ్​లోకి వస్తాడని ఎంతో మంది మాజీలు, సహచర ఆటగాళ్లు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

kohli warner
డేవిడ్ వార్నర్​

ఇప్పుడు ఆస్ట్రేలియా ఆటగాడు, దిల్లీ క్యాపిటల్స్ జట్టు ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌.. విరాట్​కు ఓ సలహా​ ఇచ్చాడు. యూట్యూబ్‌ ఛానెల్‌ స్పోర్ట్స్‌ యారీతో మాట్లాడిన వార్నర్‌.. విరాట్‌కు కాస్త ఫన్నీ అడ్వైజ్‌ ఒకటి ఇచ్చాడు. ప్రతి ప్లేయర్‌ తన క్రీడా జీవితంలో ఇలాంటి దశను ఎదుర్కొంటాడని, దీనిని పెద్దగా సీరియస్‌గా తీసుకోవద్దని తెలిపాడు. అంతేకాదు మరో ఇద్దరు పిల్లలను కనమని కూడా చెప్పాడు.

"లవ్‌ను ఎంజాయ్‌ చెయ్‌.. మరో ఇద్దరు పిల్లలను కను. ఫామ్‌ ఈజ్‌ టెంపరరీ.. క్లాస్ ఈజ్‌ పర్మనెంట్‌. అందుకే నువ్వు దాన్ని ఎప్పటికీ కోల్పోవు. ప్రపంచంలోని ప్రతి ప్లేయర్‌కూ ఇలా జరగడం సహజమే. నువ్వు ఎంత గొప్ప ప్లేయర్‌వైనా సరే. నీ కెరీర్‌లో ఇలాంటి ఒడుదొడుకులు కామనే. ఒక్కోసారి ఈ దశ ఎక్కువ కాలం ఉంటుంది. బేసిక్స్‌పై ఎక్కువగా దృష్టి సారించు" అని కోహ్లీకి వార్నర్‌ సలహా ఇచ్చాడు.

ఇదీ చదవండి: క్రికెటర్​​ సాహాను బెదిరించిన జర్నలిస్టుపై నిషేధం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.