ETV Bharat / sports

Danushka Gunathilaka Sri Lanka : అత్యాచార కేసులో నిర్దోషిగా.. నేషనల్​ టీమ్​కు రీ ఎంట్రీ ఇవ్వనున్న ప్రముఖ క్రికెటర్

Danushka Gunathilaka Sri Lanka : అత్యాచార వేధింపుల కేసు కారణంగా శ్రీలంక క్రికెటర్​ దనుష్క గుణతిలకపై విధించిన నిషేధాన్ని తాజాగా శ్రీలంక క్రికెట్ బోర్డు ఎత్తివేసింది. దీంతో త్వరలో అతను మైదానంలోకి అడుగుపెట్టనున్నాడు. ఆ విశేషాలు మీ కోసం..

Danushka Gunathilaka Sri Lanka
Danushka Gunathilaka Sri Lanka
author img

By ETV Bharat Telugu Team

Published : Oct 17, 2023, 1:35 PM IST

Danushka Gunathilaka Sri Lanka : శ్రీలంక క్రికెటర్​ దనుష్క గుణతిలక త్వరలో నేషనల్ క్రికెట్ టీమ్​లోకి ఎంట్రీ ఇవ్వనున్నారు. అత్యాచార వేధింపుల కేసు కారణంగా అతనిపై విధించిన నిషేధాన్ని తాజాగా శ్రీలంక క్రికెట్ బోర్డు ఎత్తివేసింది. ఈ విషయాన్ని ఓ ప్రకటన ద్వారా క్రికెట్ శ్రీలంక తెలిపింది.

"ఆస్ట్రేలియాలో దనుష్క గుణతిలకపై వేసిన నేరారోపణలను దర్యాప్తు చేసిన శ్రీలంక క్రికెట్ బోర్డు స్వతంత్ర విచారణ కమిటీ.. నవంబర్ 2022లో గుణతిలకపై విధించిన నిషేధాన్ని పూర్తిగా ఎత్తివేయాలని సిఫార్సు చేసింది. డిస్ట్రిక్ట్ కోర్ట్ ఆఫ్ న్యూ సౌత్ వేల్స్‌లో దాఖలు చేసిన అన్ని అభియోగాల నుంచి విముక్తి పొందిన అతను.. ఇప్పుడు నేషనల్ టీమ్​లోకి తిరిగి రాగలడు." అంటూ క్రికెట్​ బోర్డు పేర్కొంది. దీనిపై క్రికెట్ లవర్స్​ హర్షం వ్యక్తం చేస్తున్నారు.

  • Sri Lanka Cricket (SLC) wishes to announce that the Independent Inquiry Committee appointed by SLC, which was tasked with investigating into the impact of the criminal allegations against Mr. Danishka Gunathilaka in Australia, has recommended a full lifting of the ban imposed on…

    — Sri Lanka Cricket 🇱🇰 (@OfficialSLC) October 17, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

Danushka Gunathilaka Case : గతేడాది టీ20 ప్రపంచ కప్‌ సమయంలో ఆస్ట్రేలియా మహిళపై అతడు అత్యాచారం చేసేందుకు యత్నించినట్లు ఆరోపణలు సంచలనం రేపాయి. దీంతో ఆసీస్​ పోలీసు అధికారులు అతడిని అరెస్ట్‌ చేశారు. అయితే తాజాగా ఆ అత్యాచారయత్న ఆరోపణలను కొట్టి పారేస్తూ తాజాగా ఆస్ట్రేలియా కోర్టు తీర్పునిచ్చింది. ఫలితంగా కేసు నుంచి గుణతిలక నిర్దోషిగా బయటపట్టాడు.

అసలేం జరిగిందంటే :
Danushka Gunathilaka Rape Case : లైంగిక వేధింపుల ఆరోపణల నేపథ్యంలో శ్రీలంక క్రికెటర్‌ గుణతిలకను గతేడాది నవంబర్‌లో సిడ్నీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ' కొంతకాలం క్రితం గుణతిలకకు ఆన్‌లైన్​లో ఓ 29 ఏళ్ల మహిళ పరిచయమైంది. వీరిద్దరూ నవంబర్‌ 2న రోజ్‌ బే లోని ఓ హెటల్‌ గదిలో మీట్ అయ్యారు. ఆ తర్వాత అతడు ఆమెపై అత్యాచారానికి ప్రయత్నించాడు' అంటూ పోలీసులు దనుష్కపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. కేసు పెట్టిన మహిళ కూడా తనను గుణతిలక బలవంత చేయబోయాడని, ముద్దు కూడా పెట్టబోయాడని ఆరోపించింది. అయితే విచారణ సమయంలో మాత్రం రెండు రకాలుగా వాదనలు వినిపించింది. దీంతో న్యాయమూర్తి.. గుణతిలకకు అనుకూలంగా తీర్పును ఇచ్చారు.

అత్యాచార కేసులో క్రికెటర్ అరెస్ట్​.. జాతీయ జట్టు నుంచి కూడా సస్పెండ్​​

'ధనుష్క.. 'ఆమె' గొంతును బిగించి నరకం చూపించాడు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.