ETV Bharat / sports

INDW vs ENGW: చెలరేగిన వ్యాట్.. సిరీస్ ఇంగ్లాండ్ కైవసం - T20 series third match

ఇంగ్లాండ్​ మహిళా జట్టుతో జరిగిన మూడో టీ20లో భారత మహిళా జట్టు ఓటమి చవిచూసింది. డేనియల్ వ్యాట్​​ విధ్వంసంతో ఇంగ్లాండ్​ను విజయం వరించింది. దీంతో సిరీస్​ను 2-1 తేడాతో కోల్పోయింది టీమ్ఇండియా.

IND vs ENG womens t20
ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్​
author img

By

Published : Jul 15, 2021, 11:25 AM IST

ఇంగ్లాండ్ మహిళా జట్టుతో జరిగిన మూడో టీ20 మ్యాచ్​లో టీమ్ఇండియా​ ఓటమి చవిచూసింది. దీంతో టీ20 సిరీస్​ 2-1తో కైవసం చేసుకుంది ఇంగ్లీష్ జట్టు.

మొదట టాస్​ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇండియా.. ఆరు వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసింది. ఓపెనర్​ షెఫాలీ వర్మ విఫలమైనా.. స్మృతి మంధాన పదునైన షాట్లతో 70 పరుగులు చేసింది. హర్మన్​ ప్రీత్​ కౌర్​(36), రిచా ఘోష్​ (20) ఆకట్టుకున్నారు.

అనంతరం బరిలో దిగిన ఇంగ్లాండ్​ మొదట తడబడినా డేనియల్​ వ్యాట్​ విధ్వంసంతో విజయాన్ని చేజిక్కించుకుంది. 18.4 ఓవర్లలోనే 154 పరుగులు చేసింది. ఓపెనర్ బ్యుమౌంట్​ తొందరగానే వెనుదిరిగింది. తర్వాత క్రీజులోకి వచ్చిన వ్యాట్ (89) చెలరేగింది. సీవర్​తో కలిసి 112 పరుగులు జోడించింది. దీంతో ఇంగ్లీష్ జట్టు చివరి టీ20లో విజయం సాధించి సిరీస్​ను కైవసం చేసుకుంది.

ఇదీ చదవండి: ICC Rankings: టేలర్ డబుల్ ధమాకా.. దిగువకు మిథాలీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.