ETV Bharat / sports

వనిందు హసరంగ సూపర్ రికార్డ్​.. వరుసగా 3 మ్యాచ్‌ల్లో ఐదేసి వికెట్లు - Ireland vs Sri lanka 2023

CWC Qualifier 2023 : ప్రపంచ కప్‌ క్వాలిఫయర్స్‌ 2023లో శ్రీలంక స్పిన్నర్‌ వనిందు హసరంగ సూపర్​ రికార్డు సాధించాడు. ఆ వివరాలు..

Wasindu Hasaranga
వనిందు హసరంగ సూపర్ రికార్డ్​.. వరుసగా 3 మ్యాచ్‌ల్లో 5 వికెట్లు
author img

By

Published : Jun 25, 2023, 9:18 PM IST

CWC Qualifier 2023 : ప్రపంచ కప్‌ క్వాలిఫయర్స్‌ 2023 ప్రస్తుతం జరుగుతున్నాయి. అయితే ఈ టోర్నీలో తాజాగా శ్రీలంక స్పిన్నర్‌ వనిందు హసరంగ రికార్డు సృష్టించాడు. ఐర్లాండ్‌తో నేడు(జూన్‌ 25) జరిగిన మ్యాచ్‌లో ఐదు వికెట్లు తీసిన అతడు.. వరుసగా మూడు వన్డేల్లో 5 లేదా అంతకన్నా ఎక్కువ వికెట్లు(16 వికెట్లు) తీసిన రెండో బౌలర్‌గా ఘనత సాధించాడు. గతంలో పాకిస్థాన్​ స్పీడ్‌స్టర్‌ వకార్‌ యూనిస్‌ మాత్రమే వన్డేల్లో ఇలా హ్యాట్రిక్‌ ఫైఫర్స్‌(15 వికెట్లు) మార్క్​ను అందుకున్నాడు.

wanindu hasaranga best bowling figures : ఈ టోర్నీలో యూఏఈతో జరిగిన మ్యాచ్‌లో ఆరు(8-1-24-6) వికెట్లు తీసిన హసరంగ.. ఆ తర్వాత ఒమన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఐదు(7.2-2-13-5) వికెట్లు పడగొట్టాడు. ఇప్పుడు తాజాగా ఐర్లాండ్‌పై మరోసారి ఐదు(10-0-79-5) వికెట్ల ప్రదర్శన చేశాడు. ఈ తాజా మ్యాచ్​లో హసరంగ మంచిగా రాణించడం వల్ల ఐర్లాండ్‌పై శ్రీలంక 133 పరుగుల భారీ తేడాతో విజయాన్ని అందుకుంది. గ్రూప్‌-బీ నుంచి సూపర్‌ సిక్స్‌కు చేరిన మొదటి టీమ్​గా నిలిచింది. మరోవైపు ఈ మ్యాచ్‌లో ఓటమితో ఐర్లాండ్‌ టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఇక గ్రూప్‌-బీ నుంచి శ్రీలంకతో పాటు స్కాట్లాండ్‌, ఒమన్‌లు టీమ్స్​ కూడా సూపర్‌ సిక్స్‌కు అర్హత సాధించాయి. గ్రూప్‌-ఏ నుంచి జింబాబ్వే, నెదర్లాండ్స్‌, వెస్టిండీస్‌ సూపర్‌ సిక్స్‌కు వెళ్లాయి.

Ireland vs Sri lanka 2023 : ఇక తాజాగా జరిగిన మ్యాచ్‌ విషయానికొస్తే.. ఈ మ్యాచ్‌లో శ్రీలంక 133 పరుగుల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్‌ చేసిన శ్రీలంక 49.5 ఓవర్లలో 325 పరుగులకు ఆలౌట్ అయింది. కరుణరత్నే(103) సెంచరీతో విజృంభించగా.. సదీర సమరవీర (82) హాఫ్​ సెంచరీతో రాణించాడు. చరిత్‌ అసలంక(38), ధనంజయ డిసిల్వ (42*) పర్వాలేదనిపించారు. ఐర్లాండ్‌ బౌలర్లలో మార్క్‌ అదైర్‌ 4, బ్యారీ మెక్‌కార్తీ 3, గెరత్‌ డెలానీ 2 వికెట్లు దక్కించుకున్నారు.

ఆ తర్వాత భారీ లక్ష్య ఛేదనకు దిగిన ఐర్లాండ్‌.. హసరంగ (5/79), మహీష్‌ తీక్షణ (2/28), కసున్‌ రజిత (1/22), లహీరు కుమార (1/33), దసున్‌ షనక (1/21) దెబ్బకు కుప్పకూలింది. 31 ఓవర్లలో 192 పరుగులకే పరిమితమైంది. ఐర్లాండ్‌ బ్యాటర్లలో కర్టిస్‌ క్యాంపర్‌ (39) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. హ్యారీ టెక్టర్​(33), గార్జ్​ డాక్రెల్​ (26) పర్వాలేదనిపించారు. మిగతా వారు విఫలమయ్యారు.

ఇదీ చూడండి :

సాయి సుదర్శన్​ జోరు తగ్గట్లేదుగా.. వరుసగా హాఫ్​​ సెంచరీలు!

Sarfaraz Khan West Indies : సెలెక్టర్లకు సర్ఫరాజ్‌ ​గట్టి కౌంటర్​​!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.