ETV Bharat / sports

IND vs SA T20: టీమ్​ఇండియా ప్రతీకారానికి వరుణుడి ఆటంకం?

India vs South Africa 2nd T20: దక్షిణాఫ్రికాతో ఆదివారం జరిగే రెండో టీ20లో గట్టిగా పునరాగమనం చేయాలని టీమ్​ఇండియా భావిస్తోంది. ఒడిశా కటక్​లోని బారాబతి స్టేడియంలో ఈ మ్యాచ్​ జరగనుంది. తొలి టీ20లో ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని గట్టి పట్టుదలతో ఉన్న భారత్​ ఆశలపై వరుణుడు నీళ్లు చల్లుతాడా?

author img

By

Published : Jun 12, 2022, 11:54 AM IST

Rain affect ind vs sa
IND vs SA 2nd T20I

India vs South Africa 2nd T20: దక్షిణాఫ్రికాతో 5 మ్యాచ్​ల టీ20 సిరీస్​ను ఓటమితో ఆరంభించింది టీమ్​ఇండియా. దిల్లీ వేదికగా జూన్ 9న జరిగిన తొలి మ్యాచ్​లో భారీ స్కోరు (211) సాధించినా.. బౌలర్లు, ఫీల్డింగ్ వైఫల్యాలతో ఓటమిని మూటగట్టుకుంది. అయితే ఆదివారం (జూన్ 12) ఒడిశా కటక్​లోని బారాబతి మైదానంలో జరగనున్న రెండో టీ20లో గెలిచి సిరీస్​లో గెలిచి సిరీస్​ను సమం చేయాలని భావిస్తోంది. అయితే గట్టిగా పునరాగమనం చేయాలని భావిస్తున్న టీమ్​ఇండియా ప్రణాళికకు వరుణుడు గండి కొట్టే అవకాశం ఉంది.

మ్యాచ్​ సందర్భంగా వర్షం పడే అవకాశం పెద్దగా లేకున్నా.. ఆకాశం మేఘావృతమై ఉంటుందని భువనేశ్వర్​లోని ప్రాంతీయ వాతావరణ కేంద్రం (ఆర్​ఎంసీ) శనివారం పేర్కొంది. "వర్షం పడే అవకాశం 50:50. ఆదివారం సాయంత్రం వర్షం పడదని కచ్చితంగా చెప్పలేం. ఉరుములతో కూడిన వర్షం పడొచ్చు. అయితే అది 3-4 గంటల ముందు మాత్రమే తెలుస్తుంది. కొన్ని చినుకులు పడినా భారీ వాన పడకపోవచ్చు. అదేమీ మ్యాచ్​ను ప్రభావితం చేయదు" అని ఆర్​ఎంసీ డైరెక్టర్​ హెఆర్​ బిశ్వాస్ తెలిపారు.

ఇక తాత్కాలిక సారథి రిషభ్ పంత్ నేతృత్వంలో తొలి టీ20లో 7 వికెట్ల తేడాతో ఓడిన టీమ్​ఇండియా ప్రతీకారం తీర్చుకోవాలని ఎదురుచూస్తోంది. ఆ మ్యాచ్​లో తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్ నిర్ణీత ఓవర్లలో 4 వికెట్లకు 211 పరుగులు చేసింది. ఇషాన్‌ కిషన్‌ (76; 48 బంతుల్లో 11×4, 3×6) అర్ధశతకంతో చెలరేగాడు. శ్రేయస్‌ (36; 27 బంతుల్లో 1×4, 3×6), పంత్‌ (29; 16 బంతుల్లో 2×4, 2×6), హార్దిక్‌ పాండ్య (31 నాటౌట్‌; 12 బంతుల్లో 2×4, 3×6) కూడా మెరిశారు. ఛేదనలో దక్షిణాఫ్రికా మూడు వికెట్లు కోల్పోయి 19.1 ఓవర్లలో లక్ష్యాన్ని చేరుకుంది. వాండర్‌ డసెన్‌ (75 నాటౌట్‌; 46 బంతుల్లో 7×4, 5×6), 'మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌' మిల్లర్‌ (64 నాటౌట్‌; 31 బంతుల్లో 4×4, 5×6) నాలుగో వికెట్‌కు అజేయంగా 131 పరుగులు జోడించి జట్టును గెలిపించారు.

ఇదీ చూడండి: పంత్​ కెప్టెన్సీకి సవాల్​.. రెండో టీ20లో భారత్​ బోణి కొడుతుందా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.