ఐపీఎల్-2021లో కీలక ఘట్టానికి రంగం సిద్ధమైంది(csk vs dc). దుబాయ్ వేదికగా జరగుతున్న తొలి క్వాలిఫైయర్‌లో టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది సీఎస్కే. సీఎస్కే తుది జట్టులో ఎలాంటి మార్పులు చేయలేదు. కాగా.. డీసీ.. టామ్ కరెన్‌ను తీసుకుంది.
జట్లు
డీసీ:- పృథ్వీ షా, ధావన్, పంత్, శ్రేయస్, హెట్‌మయర్, టామ్ కరెన్, అక్షర్, అశ్విన్, రబాడ, నార్జ్, అవేశ్
చెన్నై సూపర్ కింగ్స్: రుతురాజ్, డుప్లెసిస్, మొయిన్ అలీ, అంబటి రాయుడు, ఉతప్ప, ధోని, జడేజా, బ్రావో, శార్దూల్, దీపక్, హేజిల్‌వుడ్
పంత్ అదుర్స్..
దిల్లీ క్యాపిటల్స్ సారథి రిషభ్ పంత్ మరో ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. ఐపీఎల్లో ఓ జట్టుకు ప్లేఆఫ్‌లో సారథి బాధ్యతలు వహించిన అతిపిన్న వయస్కుడిగా రికార్డు సృష్టించాడు. ప్రస్తుతం అతడి వయస్సు 24ఏళ్ల ఆరు రోజులు.
ఈ సీజన్‌లో బలంగా కనిపిస్తున్న చెన్నై సూపర్ కింగ్స్, దిల్లీ క్యాపిటల్స్ మధ్య తొలి క్వాలిఫయర్ రసవత్తరంగా ఉంటుందని అభిమానులు ఆశిస్తున్నారు. 14 మ్యాచ్‌ల్లో.. పదింట్లో గెలిచి 20 పాయింట్లు సాధించిన దిల్లీ అగ్రస్థానంతో.. 9 విజయాలతో 18 పాయింట్లు ఖాతాలో వేసుకున్న సీఎస్కే రెండో స్థానంతో లీగ్ దశను ముగించాయి. లీగ్ సాంతం ఈ రెండు జట్లు మెరుగ్గానే కనిపించాయి. అన్ని విభాగాల్లోనూ సత్తాచాటాయి. అయితే తొలి క్వాలిఫయర్‌లో సీఎస్కే కంటే దిల్లీ ఫేవరేట్‌గా కనిపిస్తోంది. తొలి ఐపీఎల్ టైటిల్ కోసం పట్టుదలతో ఉన్న దిల్లీ ప్రాణాలు పెట్టి ఆడుతోంది. ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొడుతోంది. లీగ్ దశలో సీఎస్కేతో ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ గెలిచింది. 2020 సీజన్ కూడా కలిపి చూసుకుంటే ఈ రెండు జట్ల మధ్య జరిగిన గత నాలుగు మ్యాచ్‌ల్లో దిల్లీదే విజయం. కానీ చివరగా ప్లేఆఫ్స్‌లో (2019లో రెండో క్వాలిఫయర్) తలపడినపుడు మాత్రం సీఎస్కే గెలిచింది. ఈ సీజన్లో చివరి మూడు లీగ్ మ్యాచ్‌ల్లోనూ ధోనీసేన ఓడినప్పటికీ ఆ జట్టును తక్కువ అంచనా వేయలేం. ప్రతికూల పరిస్థితులను దాటి విజయాలు సాధించడం ఆ జట్టుకు అలవాటే.
ఇదీ చూడండి:- టీ20 ప్రపంచకప్ విజేతకు ప్రైజ్‌మనీ ఎంతంటే?