Cricketers In Movies : భారత క్రికెటర్లు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత.. ఒక్కొక్కరు ఒక్కో రంగాన్ని ఎంచుకొని కెరీర్లో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేస్తుంటారు. అయితే క్రికెట్ నుంచి దూరం అయ్యేందుకు ఇష్టపడని కొందరు అదే రంగంలో కోచ్‌గా అవతారమెత్తుతారు. మరికొందరు వ్యాపారాల్లో రాణించాలనుకుంటారు. ఇలా ఈ రెండే కాకుండా ఇంకొందరు క్రికెటర్లు.. సినిమాలమీద ఆసక్తితో చిత్ర పరిశ్రమను ఎంచుకున్నారు. అలా ఇండస్ట్రీలో అడుగుపెట్టి సరైన విజయాలను అందుకోలేకపోయిన టీమ్ఇండియా మాజీ క్రికెటర్లు ఎవరో తెలుసుకుందాం.
ఎంఎస్ ధోనీ.. Dhoni Entertainment Movies : టీమ్ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ.. సినిమాలపై మక్కువతో 'ధోనీ ఎంటర్టైన్మెంట్' పేరుతో నిర్మాణ సంస్థను స్థాపించాడు. ఈ బ్యానర్‌కు ధోనీ సతీమణి సాక్షి సింగ్ డైరెక్టర్‌గా కొనసాగుతున్నారు. అయితే ధోనీ సొంత బ్యానర్‌పై తమిళ్లో 'ఎల్‌జీఎమ్' అనే చిత్రాన్ని నిర్మించాడు. దాదాపు రూ. 8కోట్ల వ్యయంతో రూపొందిస్తే.. ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజయం దక్కించుకోలేకపోయింది.
హర్భజన్ సింగ్.. భారత మాజీ ఆటగాడు స్పిన్ దిగ్గజం హర్భజన్ సింగ్.. 2021లో ఫ్రెండ్షిప్ అనే సినిమాలో నటించాడు. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా.. ఆశించిన స్థాయి ఫలితం అందుకోలేదు. దీంతో నటనవైపు రావాలనుకున్న హర్భజన్‌కు సైతం చేదు అనుభవమే మిగిలింది.
ఇర్ఫాన్ పఠాన్.. టీమ్ఇండియా మాజీ స్టార్ పేసర్ ఇర్ఫాన్ పఠాన్.. నటుడిగా తమిళ సినిమాతో తెరంగేట్రం చేశాడు. 2022లో తమిళ స్టార్ హీరో విక్రమ్‌తో కలిసి కోబ్రా సినిమాలో నటించాడు. కానీ ఈ సినిమా.. ప్రేక్షకుల అంచనాలు అందుకోలేక బాక్సాఫీస్ ముందు డీలా పడింది. దీంతో ఇర్ఫాన్ సినిమాలకు దూరమయ్యాడు.
శ్రీశాంత్ శర్మ.. ఫిక్సింగ్ ఆరోపణలతో జట్టులో స్థానం కోల్పోయిన టీమ్ఇండియా బౌలర్ శ్రీశాంత్ శర్మ. ఆ తర్వాత జట్టులో ఎంట్రీ ఇచ్చేందుకు చాలా ప్రయత్నాలు చేశాడు. కానీ ఎవేవీ ఫలించలేదు. ఇక సినిమాలవైపు మళ్లిన శ్రీశాంత్.. కెరీర్లో చాలా సినిమాల్లో నటించాడు. అయితే ఏ సినిమా కూడా అతడికి స్టార్డమ్ తీసుకురాలేకపోయింది. తాజాగా కోలీవుడ్ డైరెక్టర్ విఘ్నేష్ శివన్.. తెరకెక్కించిన 'కథు వాకిల్ దౌ కాదల్' సినిమాలో నటించాడు. ఈ సినిమా కూడా డిజాస్టర్‌గా నిలిచింది.
-
An album filled with energetic and emotional songs. The full soundtrack of #LGMTelugu is out now!
— Dhoni Entertainment Pvt Ltd (@DhoniLtd) August 4, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
▶️ https://t.co/OtSTdh03l1 pic.twitter.com/MiMKHcLiPe
">An album filled with energetic and emotional songs. The full soundtrack of #LGMTelugu is out now!
— Dhoni Entertainment Pvt Ltd (@DhoniLtd) August 4, 2023
▶️ https://t.co/OtSTdh03l1 pic.twitter.com/MiMKHcLiPeAn album filled with energetic and emotional songs. The full soundtrack of #LGMTelugu is out now!
— Dhoni Entertainment Pvt Ltd (@DhoniLtd) August 4, 2023
▶️ https://t.co/OtSTdh03l1 pic.twitter.com/MiMKHcLiPe
Dhoni LGM movie review : ధోనీ ఫస్ట్ మూవీ రివ్యూ.. యోగిబాబే కాపాడాలి!
ఒక్కో ఫార్మాట్‌కు ఒక్కో కోచ్.. హర్భజన్ సింగ్ కీలక వ్యాఖ్యలు