దిల్లీ క్యాపిటల్స్‌కు మెంటర్లుగా ఉన్న రికీ పాంటింగ్, గంగూలీపై పొగడ్తల వర్షం కురిపిస్తున్నాడు శిఖర్ ధావన్. వారి నుంచి తాను చాలా నేర్చుకున్నానని, ప్రపంచకప్‌లో వాటిని ఉపయోగించి సత్తాచాటుతానని ధావన్ తెలిపాడు. ఐపీఎల్లో దిల్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్నాడీ గబ్బర్.
"రికీ పాంటింగ్, గంగూలీ మా జట్టుకి మెంటర్లుగా ఉండటం నా అదృష్టం. వారి నుంచి చాలా నేర్చుకున్నాను. ప్రపంచకప్‌లో సత్తాచాటుతా" -శిఖర్ ధావన్, భారత ఓపెనర్
128 వన్డేలాడిన ధావన్ 5,355 పరుగులు చేశాడు. ప్రపంచకప్ జట్టులో చోటు సాధించిన ఈ ఓపెనర్ ప్రస్తుతం ఐపీఎల్లో సత్తాచాటుతున్నాడు. ఈ సీజన్లో 11 మ్యాచ్‌లాడి 401 పరుగులు చేశాడు. ఇందులో నాలుగు అర్ధ సెంచరీలు ఉన్నాయి. మే 30 నుంచి ఇంగ్లండ్‌లో ప్రపంచకప్ జరుగనుంది.