ETV Bharat / sports

WC19: ఆసీస్​ను ఆదుకున్న స్మిత్​, కౌల్టర్​నైల్​ - windies

వెస్టిండీస్​తో జరుగుతున్న మ్యాచ్​లో ఆస్ట్రేలియా 288 పరుగులకు ఆలౌటైంది. నాథన్ కౌల్టర్​ నైల్​(92), స్టీవ్ స్మిత్(73) అర్ధశతకాలతో ఆకట్టుకున్నారు. విండీస్ బౌలర్లలో బ్రాత్​వైట్ మూడు.. థామస్, షెల్డన్, రసెల్ తలో రెండు వికెట్లు తీశారు.

ఆసీస్
author img

By

Published : Jun 6, 2019, 7:11 PM IST

వెస్టిండీస్​తో జరుగుతున్న ప్రపంచకప్​ పదో మ్యాచ్​లో ఆస్ట్రేలియా 49 ఓవర్లలో 288 పరుగులకు ఆలౌటైంది. నాటింగ్​హామ్​ వేదికగా జరుగుతున్న మ్యాచ్​లో నాథన్ కౌల్టర్​నైల్​ 92 పరుగులతో విజృంభించగా... స్టీవ్ స్మిత్(73) అర్ధశతకంతో ఆకట్టుకున్నాడు. విండీస్​ బౌలర్లలో బ్రాత్​వైట్​ 3 వికెట్లతో రాణించగా... థామస్, షెల్డన్, రసెల్ తలో రెండు వికెట్లు తీశారు.

టాప్​ ఆర్డర్​ విఫలం.

టాస్​ ఓడి బ్యాటింగ్​కు దిగిన కంగారూ జట్టు ఆరంభంలోనే ఫించ్(6)​ వికెట్​ కోల్పోయింది. మూడో ఓవర్లో ఫించ్​ను ఔట్​ చేశాడు విండీస్ బౌలర్ షెల్డన్. అనంతరం కాసేపటికే డేవిడ్ వార్నర్​ను(3) పెవిలియన్ చేర్చాడు థామస్. తర్వతా ఖవాజా(13).. రసెల్ బౌలింగ్​లో క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రమాదకర మ్యాక్స్​వెల్​ను(0) షెల్డన్​ డక్​ ఔట్ చేశాడు.

ఆదుకున్న స్టీవ్ స్మిత్​..

38 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న ఆసీస్​ను స్మిత్ ఆదుకున్నాడు. నిలకడైన ఆటతీరుతో ఆకట్టుకున్నాడు. చెత్త బంతులను బౌండరీకి తరలిస్తూ చక్కటి ప్రదర్శన చేశాడు. ఓ వైపు వికెట్లు పడుతున్నా.. క్రీజులో పాతుకుపోయి విండీస్​ బౌలర్ల సహనాన్ని పరీక్షించాడు. 103 బంతుల్లో 73 పరుగులు చేసి థామస్ బౌలింగ్​లో ఔటయ్యాడు. అలెక్స్​ కేరీ(45), కౌల్టర్​నైల్​తో కలిసి విలువైన భాగస్వామ్యాలను నమోదు చేశాడు.

మెరుపులు మెరిపించిన కౌల్టర్​ నైల్​..

నిదానంగా సాగుతున్న స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు కౌల్టర్​ నైల్. ఆరంభం నుంచి ప్రత్యర్థులపై ఎదురుదాడికి దిగాడు. ఆసీస్ స్కోరు 150 అయినా దాటుతుందా అనుకున్నారు ఆసీస్ అభిమానులు. కానీ కౌల్టర్​ దూకుడుకు కంగారూ జట్టు భారీ స్కోరు సాధించింది. స్మిత్​ తో కలిసి 102 పరుగుల భాగస్వామ్యాన్ని నిర్మించాడు. 60 బంతుల్లో 92 పరుగులు చేసిన కౌల్టర్​ నైల్ కొద్దిలో శతకాన్ని మిస్​ చేసుకున్నాడు.

ఆరంభంలో పదునైన బంతులతో ఇబ్బంది పెట్టిన విండీస్ బౌలర్లు తర్వాత తేలిపోయారు. స్మిత్ - కౌల్టర్​ నైల్ జోడీని విడదీయలేక ఇబ్బంది పడ్డారు. టాప్​ ఆర్డర్​ను త్వరగా పెవిలియన్ చేర్చిన విండీస్​ బౌలర్లు.. మిడిల్​ ఆర్డర్ వికెట్లు తీయడానికి ఇబ్బంది పడ్డారు. చివర్లో బ్రాత్​వైట్.. కౌల్టర్​ నైల్​, కమిన్స్​, స్టార్క్ వికెట్లు తీసి ఆసీస్ ఇన్నింగ్స్ ముగించాడు.

AP Video Delivery Log - 1300 GMT Horizons
Thursday, 6 June, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last 24 hours. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-1116: HZ US Amazon Air and Space AP Clients Only 4214509
Amazon says drones will be making deliveries in 'months'
AP-APTN-1015: HZ UK Theresa May's Style AP Clients Only 4202057
A passion for fashion - a look at Theresa May's style +UPDATED EDIT/ SHOTLIST & SCRIPT +
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.