భారత్ - న్యూజిలాండ్ మధ్య జరగబోయే సెమీస్ మ్యాచ్ కోసం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. మాంచెస్టర్ వేదికగా జరగనున్న ఈ సెమీస్ సంగ్రామానికి వరణుడు అడ్డుపడే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి.
బ్రిటిష్ వాతావరణ శాఖ అంచనా ప్రకారం మంగళవారం వర్షం కురిసే అవకాశముంది. అయితే సెమీస్, ఫైనల్ మ్యాచ్‌లకు రిజర్వ్ డే ఉంది కాబట్టి ఎలాంటి సమస్య లేదు. కానీ రిజర్వ్ డే లోనూ వర్షం కురిస్తే అప్పుడు పరిస్థితి ఏంటి? .
సెమీస్ రోజు వర్షం కురిస్తే దాదాపు అదే రోజు మ్యాచ్ ముగించేందుకు ప్రయత్నిస్తారు. ఓవర్లు తగ్గించి డక్ వర్త్ లూయిస్ విధానం ద్వారా ఫలితం తేలుస్తారు. అసలు మ్యాచ్ జరపడమే కుదరకపోతే రిజర్వ్ డే ఉంటుంది. బుధవారం ఆ మ్యాచ్ నిర్వహిస్తారు.
రిజర్వ్ డేలోనూ వర్షం కురిస్తే.. భారత్ ఫైనల్‌కు
దురదృష్టవశాత్తు రిజర్వ్ డేలోనూ వర్షం పడితే అప్పుడు రిఫరీ... లీగ్ దశలో ఇరు జట్ల విజయాల ఆధారంగా మ్యాచ్ ఫలితం తేలుస్తాడు. ఆ రకంగా చూసుకుంటే మంగళవారం భారత్ - న్యూజిలాండ్ మధ్య జరిగే మ్యాచ్‌కు అంతరాయం ఏర్పడితే బుధవారం మ్యాచ్ నిర్వహిస్తారు. అప్పుడూ అడ్డంకి ఏర్పడితే రెండు జట్లలో ఎక్కువ విజయాలు సొంతం చేసుకుని 15 పాయింట్ల అగ్రస్థానంలో ఉన్న భారత్ ఫైనల్‌కు చేరుతుంది.
ఇది చదవండి: WC19: కివీస్‌తో పోరుకు భారత్ ఇస్మార్ట్ ప్లాన్