టైటిల్ ఫేవరెట్లలో ఒకటైన ఇంగ్లాండ్ జట్టుకు షాక్ తగిలింది. ఆ జట్టు హార్డ్ హిట్టర్ జేసన్ రాయ్ ఇంగ్లాండ్ ఆడే తర్వాతి రెండు మ్యాచ్‌లకు దూరం కానున్నాడు. లార్డ్స్ వేదికగా ఈనెల 25న ఆస్ట్రేలియాతో మ్యాచ్‌కు బరిలోకి దిగే అవకాశం ఉందని జట్టు యాజమాన్యం తెలిపింది.
జూన్ 14న వెస్టిండీస్‌తో మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేస్తుండగా తొడ కండరాలు పట్టేయడం వల్ల మైదానాన్ని వీడాడు జేసన్. కేవలం 8 ఓవర్లు మాత్రమే ఫీల్డింగ్ చేసిన రాయ్... ఆ తర్వాత కూడా బ్యాటింగ్‌కు రాలేదు. శనివారం రాత్రి అతని ఎడమ తొడకు స్కానింగ్ తీశారు. నివేదికలను ఆదివారం పరిశీలించిన వైద్యులు... తొడ కండరాల్లో చీలికలు వచ్చినట్లు గుర్తించారు. మంగళవారం ఆఫ్గానిస్థాన్, శుక్రవారం శ్రీలంకతో ఇంగ్లాండ్ తలపడనుంది.
-
Injury updates ahead of our #CWC19 match with Afghanistan tomorrow
— England Cricket (@englandcricket) June 17, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">Injury updates ahead of our #CWC19 match with Afghanistan tomorrow
— England Cricket (@englandcricket) June 17, 2019Injury updates ahead of our #CWC19 match with Afghanistan tomorrow
— England Cricket (@englandcricket) June 17, 2019
వెన్నునొప్పితో మోర్గాన్...
ఇంగ్లాండ్ జట్టు సారథి ఇయాన్ మోర్గాన్ వెన్నునొప్పితో బాధపడుతున్నాడు. విండీస్‌తో మ్యాచ్‌లో నొప్పితో మ్యాచ్ మధ్యలోనే వెనుదిరిగాడు. మోర్గాన్ ఓల్డ్ ట్రాఫోర్డ్ మైదానంలో ఆఫ్గనిస్థాన్‌తో మ్యాచ్‌కు దూరం కానున్నాడు. లీడ్స్ వేదికగా శ్రీలంకతో మ్యాచ్‌కు ఫిట్‌గా ఉంటాడని ఇంగ్లాండ్ భావిస్తోంది.
ప్రపంచకప్‌లో ఇప్పటి వరకు నాలుగు మ్యాచ్‌లు ఆడిన ఇంగ్లాండ్...మూడింటిలో గెలిచి ఒక దాంట్లో ఓటమిపాలైంది. ప్రస్తుతం 6 పాయింట్లతో నాలుగో స్థానంలో కొనసాగుతోంది.