ఇంగ్లాండ్ (బలాలు-బలహీనతలు):
ఆతిథ్య ఇంగ్లాండ్ టైటిల్ ఫేవరెట్‌గా బరిలోకి దిగింది. టోర్నీ ఆరంభ మ్యాచ్‌లోనే దక్షిణాఫ్రికాపై 104 పరుగుల తేడాతో భారీ విజయం సొంతం చేసుకుంది. ఆ మ్యాచ్‌లో సఫారీల బౌలింగ్‌ను తుత్తునియలు చేస్తూ నలుగురు ఆటగాళ్లు అర్ధశతకాలతో చెలరేగిపోయారు. 312 పరుగుల లక్ష్యఛేదనతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికాను పదునైన పేస్ లైనప్‌తో అడ్డుకుంది మోర్గాన్ సేన.
రెండో మ్యాచ్‌లో పాకిస్థాన్ నిర్దేశించిన 349 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే ప్రయత్నం చేసినా... గెలుపు అంచుల వరకు వచ్చి కుప్పకూలింది. ఫలితంగా 14 పరుగుల తేడాతో విజయం పాక్ సొంతమైంది.
-
Snaps FROM Bangladesh team's final practice session ahead of the clash against England on June 8. pic.twitter.com/s8boakIUpq
— Bangladesh Cricket (@BCBtigers) June 7, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">Snaps FROM Bangladesh team's final practice session ahead of the clash against England on June 8. pic.twitter.com/s8boakIUpq
— Bangladesh Cricket (@BCBtigers) June 7, 2019Snaps FROM Bangladesh team's final practice session ahead of the clash against England on June 8. pic.twitter.com/s8boakIUpq
— Bangladesh Cricket (@BCBtigers) June 7, 2019
రెండు మ్యాచుల్లోనూ 300 పైగా పరుగులు చేసి ఈ ఏడాది ప్రపంచకప్‌లో భారీ స్కోర్లు చేయగలిగే సత్తా ఉన్న జట్టుగా పేరు తెచ్చుకుంది.
- రాయ్, రూట్, బట్లర్, మోర్గాన్‌తో ఆతిథ్య జట్టు బ్యాటింగ్ లైనప్ బలంగా ఉంది. బౌలింగ్‌లో జోఫ్రా ఆర్చర్, ఆల్‌రౌండర్‌గా స్టోక్స్ రాణిస్తున్నారు.
- బ్యాటింగ్‌లో బలంగా ఉన్నా స్పిన్ ఆడటంలో విఫలమవుతోంది ఇంగ్లాండ్. బలమైన పేస్ బౌలింగ్‌తో రాణిస్తున్నా మధ్య ఓవర్లలో పరుగులు సమర్పించుకుంటున్నారు ఫాస్ట్ బౌలర్లు.
బంగ్లాదేశ్ (బలాలు-బలహీనతలు):
తన తొలి ప్రపంచకప్ మ్యాచ్‌లో 330 పరుగుల భారీ స్కోరు చేసింది బంగ్లాదేశ్. అదీ దక్షిణాఫ్రికా లాంటి బలమైన జట్టుపై. ఫలితంగా.. 21 పరుగుల తేడాతో విజయం సాధించి ఖాతా తెరిచింది. సమష్టిగా రాణిస్తే పెద్ద జట్లనైనా ఓడించగలమనే ఆత్మస్థైర్యంతో బంగ్లా ఆటగాళ్లు ఉన్నారు.
న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లోనూ 244 పరుగులే చేసినా కివీస్ ఆటగాళ్లకు చుక్కలు చూపించారు. బంగ్లా అద్భుతమైన బౌలింగ్‌తో 47వ ఓవర్ వరకు పట్టు విడవకుండా ప్రయత్నించారు. చివరికి 2 వికెట్ల తేడాతో న్యూజిలాండ్ గెలిచినా బంగ్లా తనదైన ఆటతీరుతో ఆకట్టుకుంది. పేస్ ఆడటంలో కాస్త ఇబ్బంది పడుతున్న ఈ జట్టు... బౌలింగ్ పటిష్ఠంగా ఉండటంతో తక్కువ స్కోరు చేసినా పోటీ ఇవ్వగలుగుతోంది.
-
Who are you backing for us with the bat tomorrow? 🏴🇧🇩https://t.co/piZj0EUyYe#WeAreEngland #CWC19#ExpressYourself pic.twitter.com/aQc8WGbp1T
— England Cricket (@englandcricket) June 7, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">Who are you backing for us with the bat tomorrow? 🏴🇧🇩https://t.co/piZj0EUyYe#WeAreEngland #CWC19#ExpressYourself pic.twitter.com/aQc8WGbp1T
— England Cricket (@englandcricket) June 7, 2019Who are you backing for us with the bat tomorrow? 🏴🇧🇩https://t.co/piZj0EUyYe#WeAreEngland #CWC19#ExpressYourself pic.twitter.com/aQc8WGbp1T
— England Cricket (@englandcricket) June 7, 2019
- ముష్ఫికర్ రహీమ్, సౌమ్య సర్కార్,మహ్మదుల్లా బ్యాటింగ్‌లో రాణిస్తున్నారు. షకిబుల్ హసన్ ఆల్‌రౌండర్‌గా, ముస్తాఫిజుర్ రహ్మన్, సైఫుద్ధీన్ బౌలింగ్‌లో సత్తా చాటుతున్నారు.
- బంగ్లాకు స్పిన్ ప్రధానాయుధం కాగా బ్యాట్స్మెన్లలో నిలకడలేమి ప్రతికూలాంశం.
- రెండు జట్లు రెండేసి మ్యాచ్‌లు ఆడి ఒక్కో విజయాన్ని ఖాతాలో వేసుకున్నాయి. ఈ ప్రపంచకప్‌లో ఇరు జట్లు చివరగా తమ తమ మ్యాచ్‌ల్లో ఓడిపోయాయి.
- పాయింట్ల పట్టికలో రెండేసి పాయింట్లే ఉన్నా నెట్ రన్‌రేట్ కాస్త మెరుగ్గా ఉన్న కారణంతో ఇంగ్లండ్ ముందంజలో ఉంది. ఇప్పటివరకు రెండు జట్లు మూడుసార్లు ప్రపంచకప్‌లో తలపడగా బంగ్లా రెండు, ఇంగ్లాండ్ ఒక మ్యాచ్‌లోనూ నెగ్గాయి.
జట్లు అంచనా...
ఇంగ్లాండ్: జాసన్ రాయ్, జానీ బెయిర్ స్టో, జోయ్ రూట్, ఇయాన్ మోర్గాన్(కెప్టెన్), బెన్ స్టోక్స్, జాస్ బట్లర్(కీపర్), మొయిన్ అలీ, క్రిస్ వోక్స్, జోఫ్రా ఆర్చర్, మార్క్ ఉడ్, లిమ్ ప్లంకెట్
( ఆదిల్ రషీద్, టామ్ కరన్, జేమ్స్ విన్సీ, లియామ్ డాసన్)
బంగ్లాదేశ్: తమీమ్ ఇక్బాల్, సౌమ్య సర్కార్, షకిబుల్ హసన్, ముష్ఫికర్ రహీమ్(కీపర్), మహ్మద్ మిథున్, మహ్మదుల్లా, హుస్సేన్, మహ్మద్ సైఫుద్ధీన్, మెహిదీ హసన్, మష్రఫా మొర్తజా(సారథి), ముస్తాఫిజుర్ రహ్మన్,
(లిటన్ దాస్, సబ్బీర్ రహ్మాన్, రూబెల్ హొస్సేన్, అబు జాయెద్)