ప్రపంచకప్‌లో వరుస ఓటములతో ఇబ్బందిపడుతోన్న దక్షిణాఫ్రికా జట్టు న్యూజిలాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లోనూ అదే పంతా కొనసాగించింది. వర్షం కారణంగా ఆలస్యంగా ప్రారంభమైన ఆటను 49 ఓవర్లకు కుదించారు. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన సఫారీ జట్టు నిర్ణీత 49 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 241 పరుగులు చేసింది. ఆమ్లా, డసెన్ అర్ధశతకాలతో రాణించడం వల్ల ఆ మాత్రం స్కోరైనా సాధించారు సఫారీలు.
-
INNINGS BREAK | SA 241/6, 49 overs
— Cricket South Africa (@OfficialCSA) June 19, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
The Proteas have put together a total on a tricky Edgbaston wicket, after losing early wickets @amlahash (55) and @Rassie72 (67*) have top-scored.
NZ require 242 runs in 49 overs#ProteaFire 🔥#CWC19 #NZvSA pic.twitter.com/OxNdbJCQg1
">INNINGS BREAK | SA 241/6, 49 overs
— Cricket South Africa (@OfficialCSA) June 19, 2019
The Proteas have put together a total on a tricky Edgbaston wicket, after losing early wickets @amlahash (55) and @Rassie72 (67*) have top-scored.
NZ require 242 runs in 49 overs#ProteaFire 🔥#CWC19 #NZvSA pic.twitter.com/OxNdbJCQg1INNINGS BREAK | SA 241/6, 49 overs
— Cricket South Africa (@OfficialCSA) June 19, 2019
The Proteas have put together a total on a tricky Edgbaston wicket, after losing early wickets @amlahash (55) and @Rassie72 (67*) have top-scored.
NZ require 242 runs in 49 overs#ProteaFire 🔥#CWC19 #NZvSA pic.twitter.com/OxNdbJCQg1
దక్షిణాఫ్రికా జట్టుకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. రెండో ఓవర్లోనే ఓపెనర్ డికాక్ (5) పెవిలియన్ చేరాడు. సారథి డుప్లెసిస్‌తో కలిసి ఆమ్లా రెండో వికెట్‌కు 50 పరుగులు జోడించాడు. అనంతరం డుప్లెసిస్ 23 పరుగులు చేసి ఔటయ్యాడు. మర్కరమ్తో కలిసి మరో అర్ధశతక భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు ఆమ్లా. ఈ క్రమంలోనే అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. అంతేకాకుండా వన్డేల్లో 8వేల పరుగుల మైలురాయిని అందుకున్నాడు హషీమ్ ఆమ్లా.
-
And the answer is...🥁🥁@amlahash! who achieved the milestone today.
— Cricket South Africa (@OfficialCSA) June 19, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
Congrats to all who got it correct.#ProteaFire 🔥#CWC19 #NZvSA pic.twitter.com/D7PgEmuJDP
">And the answer is...🥁🥁@amlahash! who achieved the milestone today.
— Cricket South Africa (@OfficialCSA) June 19, 2019
Congrats to all who got it correct.#ProteaFire 🔥#CWC19 #NZvSA pic.twitter.com/D7PgEmuJDPAnd the answer is...🥁🥁@amlahash! who achieved the milestone today.
— Cricket South Africa (@OfficialCSA) June 19, 2019
Congrats to all who got it correct.#ProteaFire 🔥#CWC19 #NZvSA pic.twitter.com/D7PgEmuJDP
ఆమ్లా ఔటైనా వాన్‌డర్ డసెన్, మిల్లర్ బాధ్యతాయుతంగా ఆడారు. ఐదో వికెట్‌కు 72 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాక మిల్లర్ (36) ఔటయ్యాడు. మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ డసెన్ అర్ధశతకంతో ఆకట్టుకున్నాడు. చివరికి 67 పరుగులతో నాటౌట్‌గా నిలిచి జట్టుకు గౌరవప్రదమైన స్కోర్ అందించడంలో కీలకపాత్ర పోషించాడు.
న్యూజిలాండ్ బౌలర్లు కట్టుదిట్టమైన బౌలింగ్‌తో ఆకట్టుకున్నారు. వరుసగా వికెట్లు తీస్తూ సఫారీ బ్యాట్స్‌మెన్‌పై ఒత్తిడి పెంచారు. కివీస్ బౌలర్లలో ఫర్గూసన్ మూడు వికెట్లు తీయగా.. బౌల్ట్, గ్రాండ్‌హోమ్, సాంట్నర్ చెరో వికెట్ దక్కించుకున్నారు.