హెడింగ్లేలోని లీడ్స్ మైదానం వెలుపల అఫ్గాన్, పాక్ అభిమానులు కొట్టుకున్నారు. ఓ ఎయిర్‌క్రాఫ్ట్ గాలిలో ఎగురుతూ బలోచిస్థాన్‌కు న్యాయం చేయాలని ఓ బ్యానర్‌ను ప్రదర్శించడమే కారణంగా తెలుస్తోంది. బలోచిస్థాన్ నినాదాలతో ఓ ఫ్లయిట్ స్టేడియం బయట తిరగడాన్ని పాక్ అభిమానులు గుర్తించారు. ఇదే ఘర్షణకు దారితీసింది. ఈ ఘటనపై ఐసీసీ ప్రతినిధి వివరణ ఇచ్చారు.
-
#WATCH: A scuffle breaks out between Pakistan and Afghanistan fans outside Headingley Cricket Ground in Leeds after an aircraft was flown in the area which had 'Justice for Balochistan' slogan. Leeds air traffic will investigate the matter. pic.twitter.com/mN8yymQOP5
— ANI (@ANI) June 29, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">#WATCH: A scuffle breaks out between Pakistan and Afghanistan fans outside Headingley Cricket Ground in Leeds after an aircraft was flown in the area which had 'Justice for Balochistan' slogan. Leeds air traffic will investigate the matter. pic.twitter.com/mN8yymQOP5
— ANI (@ANI) June 29, 2019#WATCH: A scuffle breaks out between Pakistan and Afghanistan fans outside Headingley Cricket Ground in Leeds after an aircraft was flown in the area which had 'Justice for Balochistan' slogan. Leeds air traffic will investigate the matter. pic.twitter.com/mN8yymQOP5
— ANI (@ANI) June 29, 2019
"మైదానం వెలుపల సంచరించిన ఎయిర్‌క్రాఫ్ట్‌కు అనుమతి లేదు. లీడ్స్ ఎయిర్ ట్రాఫిక్ దీనిపై విచారణ చేపట్టింది"
- ఐసీసీ ప్రతినిధి
మ్యాచ్‌కు ముందు కొందరు అభిమానులు స్టేడియం గోడ దూకి లోపలికి ప్రవేశించేందుకు ప్రయత్నించారు. తమ హక్కులను హరిస్తోన్న పాక్ నుంచి కాపాడాలంటూ వరల్డ్ బలోచ్ ఆర్గనైజేషన్,బలోచి రిపబ్లికన్ పార్టీ ప్రచారం నిర్వహిస్తున్నాయి.
ఇటీవల బర్మింగ్‌హామ్ స్టేడియం బయట ఇదే విధంగా బ్యానర్లు ప్రదర్శించారు బలోచిస్థాన్ నిరసనకారులు. జూన్ 26న పాకిస్థాన్, న్యూజిలాండ్ మ్యాచ్‌కు ముందు రోడ్లు, జంక్షన్ల వద్ద పోస్టర్లు ప్రదర్శించారు. శనివారం లీడ్స్ వేదికగా అఫ్గాన్‌తో జరుగుతున్న మ్యాచ్ సమయంలోనూ ఇదే తరహాలో నిరసన ప్రదర్శన చేసినట్లు తెలుస్తోంది.